‘నీలి సూర్యుడు’ కనిపించి అలరించాడు..

శనివారం ఉదయం బ్రిటన్ ప్రజలు ఆకాశంలో ఓ దృశ్యాన్ని చూసి మురిసిపోయారు. మబ్బుల్లో సూర్యుని రంగు నీలం రంగులోకి మారిపోవడాన్ని చూసి ఆశ్యర్యపోయారు. అమెరికాలో సంభవించిన అగ్నిప్రమాదమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. 2017లో పోర్చుగీస్ అడవి కార్చిచ్చుకు సంబంధించిన పొగ బ్రిటన్ అంతటా వ్యాపించింది. అప్పుడు సూర్యుడు ముదురు ఆరెంజ్‌ రంగులో కనిపించాడు. ప్రస్తుతం సూర్యుడు నీలి రంగులోకి ఎందుకు మారాడనే దానికి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు సమాధానమిచ్చారు.

‘నీలి సూర్యుడు’ కనిపించి అలరించాడు..

|

Updated on: Oct 02, 2023 | 8:02 PM

శనివారం ఉదయం బ్రిటన్ ప్రజలు ఆకాశంలో ఓ దృశ్యాన్ని చూసి మురిసిపోయారు. మబ్బుల్లో సూర్యుని రంగు నీలం రంగులోకి మారిపోవడాన్ని చూసి ఆశ్యర్యపోయారు. అమెరికాలో సంభవించిన అగ్నిప్రమాదమే ఇందుకు కారణమని వాతావరణ శాఖ తెలిపింది. 2017లో పోర్చుగీస్ అడవి కార్చిచ్చుకు సంబంధించిన పొగ బ్రిటన్ అంతటా వ్యాపించింది. అప్పుడు సూర్యుడు ముదురు ఆరెంజ్‌ రంగులో కనిపించాడు. ప్రస్తుతం సూర్యుడు నీలి రంగులోకి ఎందుకు మారాడనే దానికి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు సమాధానమిచ్చారు. ఉత్తర అమెరికాలోని అడవి కార్చిచ్చు పొగ బ్రిటన్‌కు చేరుతోంది. వాతావరణంలో మేఘాలు, పొగ కలసిపోవడం కారణంగా సూర్యరశ్మి వివిధ రంగులలో వ్యాప్తి చెందుతుందని, ప్రతి రంగు వేర్వేరు ప్రకాశాలను కలిగి ఉంటుందని తెలిపారు. అందులో నీలి రంగు అధికంగా పర్పుల్ రంగు తక్కువగా వ్యాపిస్తుందని, ఇది దాదాపు 380 నానోమీటర్లు ఉంటుందని తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నేను ప్లే చేస్తా.. మీరు పే చెయ్యండి.. కళాకారుడి తెలివికి నెటిజన్ల ప్రశంసలు

యూట్యూబర్స్‌కి హెచ్చరిక.. వ్యూస్‌ కోసం అలాచేస్తే అంతే

మొసలిని కుక్కలా పెంచుతున్న వ్యక్తి !! నోట్లో చేయిపెట్టినా కొరకదట

TSRTC: టీఎస్‌ఆర్టీసీ బ‌స్సుల్లో తప్పనున్న చిల్లర తిప్పలు

తప్పిపోయిన బిడ్డ కనిపించగానే చెంపపై ఒక్కటిచ్చి.. నోటితో ఎత్తుకెళ్లిన పిల్లి

 

Follow us