మొసలిని కుక్కలా పెంచుతున్న వ్యక్తి !! నోట్లో చేయిపెట్టినా కొరకదట

మొసలిని కుక్కలా పెంచుతున్న వ్యక్తి !! నోట్లో చేయిపెట్టినా కొరకదట

Phani CH

|

Updated on: Oct 02, 2023 | 7:56 PM

కుక్క అయినా మరో జంతువు అయినా మనిషితో పెరిగినప్పుడు మంచి దోస్తీ కుదురుతుంది. తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఒక వీడియో అందరినీ హడలెత్తిస్తోంది. ఒక వ్యక్తి.. మొసలిని కుక్కలా సాకుతున్నాడు. ఆ మొసలి మెడ చుట్టూ తాడు కట్టి, దానిని బయట తిప్పుతున్నాడు. ఇది చూసినవారంతా షాకవుతున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో మొసలిని సాకుతున్న వ్యక్తి పేరు హెనీ. అతను బేస్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు.

కుక్క అయినా మరో జంతువు అయినా మనిషితో పెరిగినప్పుడు మంచి దోస్తీ కుదురుతుంది. తాజాగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఒక వీడియో అందరినీ హడలెత్తిస్తోంది. ఒక వ్యక్తి.. మొసలిని కుక్కలా సాకుతున్నాడు. ఆ మొసలి మెడ చుట్టూ తాడు కట్టి, దానిని బయట తిప్పుతున్నాడు. ఇది చూసినవారంతా షాకవుతున్నారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో మొసలిని సాకుతున్న వ్యక్తి పేరు హెనీ. అతను బేస్ బాల్ మ్యాచ్ చూసేందుకు వచ్చాడు. అయితే అతనితో పాటు మొసలిని తీసుకువచ్చిన కారణంగా మ్యాచ్‌ చూసేందుకు అతనికి అనుమతి ఇవ్వలేదు. అయితే తన మొసలి ఎంతో ప్రశాంతంగా ఉంటుందని అతను మీడియాకు తెలిపాడు. తన మొసలిని ఎవరైనా తాకవచ్చని, అది ఎవరిపైనా దాడి చేయదన్నాడు. దాని నాలుకను పట్టుకున్నా కూడా ఏమీ చేయదని తెలిపాడు. హెనీ 2015లొ ఈ మొసలిని దత్తత తీసుకున్నాడు. దానికి వాలీ అనిపేరు పెట్టాడు. దానిని ‘వాలిగేటర్’ అని కూడా పిలుస్తుంటాడు. దీని పొడవు 5 అడుగుల 6 అంగుళాలు. హెనీ, వాలిగేటర్‌లు యార్క్ కౌంటీలోని అతని ఇంట్లో కలసిమెలసి ఉంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TSRTC: టీఎస్‌ఆర్టీసీ బ‌స్సుల్లో తప్పనున్న చిల్లర తిప్పలు

తప్పిపోయిన బిడ్డ కనిపించగానే చెంపపై ఒక్కటిచ్చి.. నోటితో ఎత్తుకెళ్లిన పిల్లి

భర్తలు బీకేర్‌ ఫుల్ !! భార్యల బర్త్‌ డే మర్చిపోతే జైలుకే !!

Elon Musk: రెచ్చిపోయిన ఎలన్ మస్క్.. రైఫిల్‌తో కాల్పులు..

Rice Pulling: రాగి చెంబుకోసం ఆశపడి కోట్లు పోగొట్టుకున్న రియల్డర్‌