Elon Musk: రెచ్చిపోయిన ఎలన్ మస్క్.. రైఫిల్‌తో కాల్పులు..

ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఏం చేసినా చాలా డిఫరెంట్‌గా చేస్తూ ఉంటారు. అందుకే ఆయనకు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందులో మస్క్ యాక్షన్ హీరోలా మారిపోయారు. అసాల్ట్ రైఫిల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. 50 క్యాలిబర్ బ్యారెట్ రైఫిల్‌తో హిప్ ఫైరింగ్ చేస్తున్నా అంటూ ఓ క్యాప్షన్‌ జోడించి మస్క్ ఈ వీడియోను స్వయంగా పోస్ట్ చేశారు.

Elon Musk: రెచ్చిపోయిన ఎలన్ మస్క్.. రైఫిల్‌తో కాల్పులు..

|

Updated on: Oct 02, 2023 | 7:50 PM

ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఏం చేసినా చాలా డిఫరెంట్‌గా చేస్తూ ఉంటారు. అందుకే ఆయనకు లక్షల సంఖ్యలో ఫాలోవర్స్. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అందులో మస్క్ యాక్షన్ హీరోలా మారిపోయారు. అసాల్ట్ రైఫిల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. 50 క్యాలిబర్ బ్యారెట్ రైఫిల్‌తో హిప్ ఫైరింగ్ చేస్తున్నా అంటూ ఓ క్యాప్షన్‌ జోడించి మస్క్ ఈ వీడియోను స్వయంగా పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు లక్షల సంఖ్యలో లైక్ చేస్తున్నారు. వేల మంది కామెంట్లు చేస్తున్నారు. నిజంగా సినిమాలో హీరోలా ఉన్నారంటూ చాలా మంది మస్క్ ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక మస్క్ ఇప్పుడే కాదు గతంలో కూడా తుపాకులకు సంబంధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసుకున్నారు. నిత్యం తన బెడ్ పక్కన తుపాకులు ఉంటాయంటూ గతంలో ఆయన రెండు పిస్టళ్లు ఉన్న ఓ ఫోటోను షేర్ చేశారు. ఇక అసాల్ట్ రైఫిల్ వినియోగంపై ఆంక్షలు విధించాలని స్వయంగా కోరారు ఎలన్ మస్క్. అలాంటిది అదే రైఫిల్ పట్టుకుని ఫోజులివ్వడం హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rice Pulling: రాగి చెంబుకోసం ఆశపడి కోట్లు పోగొట్టుకున్న రియల్డర్‌

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ పురాతన పెట్టె !! అందులో ??

Follow us