భూమ్మీద నూకలు ఉన్నాయి.. రైలు కింద పడ్డా సేఫ్..

భూమ్మీద నూకలు ఉన్నాయి.. రైలు కింద పడ్డా సేఫ్..

Phani CH

|

Updated on: Oct 02, 2023 | 8:11 PM

రైలు కింద పడితే ఏమవుతుంది..? ఇంకేమవుతుంది. శరీరం నుజ్జు నుజ్జవడం ఖాయం. కానీ బీహార్లో మాత్రం ఓ వ్యక్తి చిన్న గాయం కూడా కాకుండా సేఫ్‌గా బయటపడ్డాడు. పైగా నవ్వుతూ రైలు కింద నుంచి లేచి ఫ్లాట్ ఫామ్‌పై వచ్చాడు. బీహార్ లోని బగాహ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా కాలు జారి ఫ్లాట్ ఫారానికి మధ్య ఉన్న గ్యాప్ లో పడిపోయాడు. ఈ సమయంలో రైలు 120 స్పీడ్ లో వెళ్తోంది.

రైలు కింద పడితే ఏమవుతుంది..? ఇంకేమవుతుంది. శరీరం నుజ్జు నుజ్జవడం ఖాయం. కానీ బీహార్లో మాత్రం ఓ వ్యక్తి చిన్న గాయం కూడా కాకుండా సేఫ్‌గా బయటపడ్డాడు. పైగా నవ్వుతూ రైలు కింద నుంచి లేచి ఫ్లాట్ ఫామ్‌పై వచ్చాడు. బీహార్ లోని బగాహ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న రైలు ఎక్కేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే ఒక్కసారిగా కాలు జారి ఫ్లాట్ ఫారానికి మధ్య ఉన్న గ్యాప్ లో పడిపోయాడు. ఈ సమయంలో రైలు 120 స్పీడ్ లో వెళ్తోంది. రైలు వెళ్లేంత వరకు అలాగే గ్యాప్ లో నక్కిన ఆ వ్యక్తి.. రైలు వెళ్లిపోగానే నవ్వుతూ ఫ్లాట్ ఫామ్‌పైకి వచ్చాడు. బాధితుడు రైలు కింద పడిపోవడాన్ని అక్కడే ఉన్న రైల్వే పోలీస్, ఇతర ప్రయాణికులు గమనించారు. అయితే రైలు వెళ్తున్న సమయంలో అతనికి పలు సూచనలు చేశారు. అలాగే ఉండు.. బయటకు రాకు.. అంటూ ధైర్యం చెప్పారు. రైలు వెళ్లాక.. రైల్వే పోలీసులు, ఇతర ప్రయాణికులు అతన్ని ఫ్లాట్ ఫారం పైకి లాగారు. దీంతో బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సదరు ప్రయాణికుడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నల్లుల దెబ్బకు ఫ్రాన్స్ విల.. విల..

‘నీలి సూర్యుడు’ కనిపించి అలరించాడు..

నేను ప్లే చేస్తా.. మీరు పే చెయ్యండి.. కళాకారుడి తెలివికి నెటిజన్ల ప్రశంసలు

యూట్యూబర్స్‌కి హెచ్చరిక.. వ్యూస్‌ కోసం అలాచేస్తే అంతే

మొసలిని కుక్కలా పెంచుతున్న వ్యక్తి !! నోట్లో చేయిపెట్టినా కొరకదట