Black Magic: నగ్నంగా గోదావరి ఒడ్డుపై తాంత్రిక పూజలు చేస్తుండగా ??

Black Magic: నగ్నంగా గోదావరి ఒడ్డుపై తాంత్రిక పూజలు చేస్తుండగా ??

Phani CH

|

Updated on: Oct 04, 2023 | 9:42 AM

ప్రపంచమంతా కంప్యూటర్‌ వేగంతో దుసుకుపోతుంటే కొందరు మాత్రం ఇంకా మూఢనమ్మకాల నుంచి బయటకు రావడం లేదు. గడప వద్దే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నా మూఢనమ్మకాల్లోనే మగ్గిపోతున్నారు. దాంతో.. కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అమాయకులు. తాజాగా.. మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. చెన్నూరు పట్టణం బొక్కలగుట్ట కాలనీకి చెందిన దాసరి మధు కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలున్నాయి.

ప్రపంచమంతా కంప్యూటర్‌ వేగంతో దుసుకుపోతుంటే కొందరు మాత్రం ఇంకా మూఢనమ్మకాల నుంచి బయటకు రావడం లేదు. గడప వద్దే అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నా మూఢనమ్మకాల్లోనే మగ్గిపోతున్నారు. దాంతో.. కొన్ని సార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అమాయకులు. తాజాగా.. మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. చెన్నూరు పట్టణం బొక్కలగుట్ట కాలనీకి చెందిన దాసరి మధు కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలున్నాయి. అయితే.. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా ఏమాత్రం ఉపశమనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మంత్రాలు, తంత్రాల వైపు ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే.. క్షుద్ర పూజలు చేయించి యువకుడి ప్రాణాల మీదికి తెచ్చారు. అనారోగ్యంతో ఉన్న అతణ్ని తాంత్రిక పూజల కోసం గోదావరి ఒడ్డుకు తీసుకెళ్లారు. నగ్నంగా రకరకాల పూజలు చేసిన మాంత్రికుడు.. యువకుడ్ని కూర్చోబెట్టి.. దూపం వేశాడు. దాంతో.. అనుకోని పరిస్థితుల్లో పూజలు కొనసాగుతుండగానే ఆ యువకుడు అపస్మారకస్థితికి చేరుకుని ప్రాణాలు విడిచాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Boney Kapoor: ఇంతకీ శ్రీదేవి మరణానికి కారణం ఏంటి ?? సీక్రెట్ బయటపెట్టిన భర్త

రైతు కష్టం తీర్చిన స్టూడెంట్ !! పేటెంట్ పొంది రికార్డ్ !!