వాట్ ఏన్ ఐడియా !! లాఠీకి లాక్ వేసిన పోలీస్ !!

వాట్ ఏన్ ఐడియా !! లాఠీకి లాక్ వేసిన పోలీస్ !!

Phani CH

|

Updated on: Oct 04, 2023 | 9:36 PM

సైనికుడికి తుపాకి ఎంత ముఖ్యమో పోలీసుకు లాఠీ అంతే ముఖ్యం. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు లాఠీలను ఉపయోగించక తప్పదు. ఈ క్రమంలో పోలీసులు లాఠీలను జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. అయితే గుంటూరులో పోలీస్ ద్విచక్ర వాహనాలకే భద్రత లేకుండా పోయింది. ఇటీవల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో విధులకు హాజరైన ఓ మహిళా కానిస్టేబుల్‌ తన టూవీలర్‌నే పొగొట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఓ కానిస్టేబుల్ అప్రమత్తమయ్యారు.

సైనికుడికి తుపాకి ఎంత ముఖ్యమో పోలీసుకు లాఠీ అంతే ముఖ్యం. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు లాఠీలను ఉపయోగించక తప్పదు. ఈ క్రమంలో పోలీసులు లాఠీలను జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. అయితే గుంటూరులో పోలీస్ ద్విచక్ర వాహనాలకే భద్రత లేకుండా పోయింది. ఇటీవల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో విధులకు హాజరైన ఓ మహిళా కానిస్టేబుల్‌ తన టూవీలర్‌నే పొగొట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఓ కానిస్టేబుల్ అప్రమత్తమయ్యారు. విధి నిర్వహణలో భాగంగా బైక్ పై వచ్చే కానిస్టేబుల్స్ తమ ఆయుధమైన లాఠీని బైక్‌కు తగిలించుకుని వచ్చారు. వారిలో ఓ పోలీసు.. తన లాఠీని అత్యంత జాగ్రత్తగా.. బైక్‌ వైర్ కి కలిపి లాక్ వేశాడు. ఇలా లాఠీలకు రక్షణ ఏర్పాటు చేసుకున్న కానిస్టేబుల్‌ను చూసి షాక్ అవుతున్నారు జనం. తాజాగా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విధుల్లో భాగంగా వచ్చిన ఓ కానిస్టేబుల్ లాఠీకి బైక్ తాళం వేయటాన్ని చూసి పలువురు ముక్కున వేలు వేసుకున్నారు. మరి కొందరైతే పోలీస్ వస్తువులకే భద్రత లేకుండా పోయిందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏదిఏమైనా లాఠీకి తాళం వేయడం మాత్రం అందరిని ఆకట్టుకుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మకు వందేళ్ల వందనం.. ఒకే వేదికపై ఆరు తరాలు

పురిట్లోనే బిడ్డ మృతి.. అంతలోనే తల్లి కూడా

MS Dhoni: కొత్త లుక్ లో అదరగొట్టిన మహేందర్ సింగ్ ధోనీ

మాల్‌లో ఫ్రిడ్జ్‌ డోర్‌ తెరిచి.. ప్రాణం కోల్పోయిన చిన్నారి

సచివాలయంలో గంజాయి మొక్క కలకలం !!