AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇప్పటికే బూతులు… ఇక కులాల కంపటి ? తెలంగాణలో రాజుకుంటున్న రాజకీయం

చౌదరి గారు, ఓ నాయుడు గారు.. రెడ్డీ గారూ ఓ రాజూ గారు.. మీ పేరు చివరలో ఆ తోకలెందుకు? అని ఒక సినిమా పాటలో కులం గజ్జిని తీవ్రంగా ఎండగడతాడొక రచయిత. కానీ.. పేర్ల చివర్లో ఉండే ఆ తోకలే రాజకీయాల్ని శాసిస్తాయని, ఎన్నికల్లో గెలుపోటముల్ని నిర్ణయిస్తాయని పొలిటికల్ పార్టీలు గాఢంగా సమ్ముతాయ్. దాని ఫలితమే ఇప్పుడు తెలంగాణలో రాజుకున్న కులాల కుంపట్లు. వీటి పుట్టుకేంటి? పర్యవసానాలేంటి? డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం...

Telangana: ఇప్పటికే బూతులు... ఇక కులాల కంపటి ? తెలంగాణలో రాజుకుంటున్న రాజకీయం
Caste Politics
Ram Naramaneni
|

Updated on: Jul 29, 2025 | 10:01 PM

Share

పదకొండేళ్ల కిందటి ముచ్చట. రాష్ట్ర విభజన ఖరారైన సమయంలో మిగతా విషయాల మాట అలా ఉంచితే.. ఒక వెర్షన్ ఐతే గట్టిగా వినిపించింది. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆ ఒకే ఒక్క కారణంతోనే నలిగిపోతుందని, చితికిపోతుందని, బాగా పల్చనైపోతుందని మేధావులు చెప్పేవారు. అదే కారణంతో తెలంగాణ పీస్‌ఫుల్‌గా ఉంటుందని, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ఒక అంచనా కూడా వేశారు. ఆ ఒక్క మూల కారణం ఏమై ఉంటుంది..? రెండు రాష్ట్రాల మీద కంబైన్డ్‌గా ఆ రేంజ్‌లో ప్రభావం చూపేంత సీరియస్‌నెస్ దానికుందా? ఆ కామన్ కాజ్ ఏమిటన్నది ఈపాటికి మీకు అర్థమయ్యే ఉంటుందిలెండి. కొన్ని తరాల పాటు నిలబడే విలువలు, సిద్ధాంతాలు, భావజాలాలు కాదు.. వేగంగా డెలివరీ ఇచ్చే స్విగ్గీ పాలిటిక్స్‌కే ఇప్పుడు గిరాకీలెక్కువ. జైపాల్ రెడ్డి స్మారక అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా కడుపు చించుకుని కాళ్ల మీద పడేసుకున్నారు. వర్తమాన రాజకీయాలంటేనే వెగటు పుడుతోందని చెప్పకనే చెప్పేశారు. జైపాల్‌రెడ్డి లాంటి స్వచ్ఛమైన రాజకీయాలు చేసే నాయకులు ఇప్పుడెక్కడ… వాళ్లకు నీడనిచ్చే పార్టీల అడ్రస్సెక్కడ..? అనేది ఆయన ఆవేదన. కాలేజీల్లో మళ్లీ యూనియన్ పాలిటిక్స్‌ని ఎంకరేజ్ చేయాలని సిన్సియర్‌గా ఓ పిలుపు కూడా ఇచ్చారు. కానీ.. యూత్‌ని వెల్‌కమ్ చేసేంత సమున్నత స్థాయిలో ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయా..? ఎక్కడికో ఎందుకు.. ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న తెలంగాణలోనే నిఖార్సయిన స్వచ్ఛమైన రాజకీయాల ఆచూకీ కొద్దికొద్దిగా గల్లంతౌతోందా.. అనే సందేహాలొస్తున్నాయి. పదేళ్లపాటు...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి