Minister Puvvada Ajay Kumar: 2023 దాకా ఎందుకు?.. ఇప్పుడు నిరూపించండి.. బండి సంజయ్‌కి‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి పువ్వాడ అజయ్

Minister Puvvada Ajay Kumar: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం..

Minister Puvvada Ajay Kumar: 2023 దాకా ఎందుకు?.. ఇప్పుడు నిరూపించండి.. బండి సంజయ్‌కి‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంత్రి పువ్వాడ అజయ్
Follow us

|

Updated on: Jan 10, 2021 | 4:53 PM

Minister Puvvada Ajay Kumar: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు ఓట్లు.. సీట్ల కోసం వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. ‘మొన్ననే వచ్చిన కొత్త బత్తాయి.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ముందు మీ పార్టీ ఖమ్మం జిల్లాకు ఏం చేసిందో చెప్పాలి. ఖమ్మం జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందే మీ పార్టీ. బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించలేదు, పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏడు మండలాలను విడగొట్టి జిల్లాకు అన్యాయం చేశారు. స్మార్ట్ సిటీ ఇవ్వలేదు, జాతీయ రహదారులు కూడా అధ్వాన్నంగా తయారయ్యాయి. ముందు వాటి గురించి మాట్లాడు.’ అంటూ బండి సంజయ్‌పై మంత్రి పువ్వాడ మండిపడ్డారు. ఆదివారం నాడు ఖమ్మంలో జరిగిన రైతు బజార్ ప్రారంభోత్సవంలో మంత్రి పువ్వాడ అజయ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఆయన నాకేదో వ్యాక్సిన్ ఏస్తాడట. నేను ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా కూకట్‌పల్లిలో నా వ్యా్క్సిన్ రుచిని వారికి చూపించాను. 10కి తొమ్మిది సీట్లు గెలిపించి నా సత్తా చూపించా. అవినీతి అంటున్నారు. 2023 వరకు ఎందుకు? ఇప్పుడు కేంద్రంలో మీ ప్రభుత్వమే ఉంది కదా.. మీకు దమ్ముంటే, చేతనైతే ఒక్క ఆరోపణను నిరూపించండి. మీ విభజన రాజకీయాలు మా జిల్లాలో చెల్లవు. ఖమ్మం ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి ఓటు వేస్తారు. అంతేకానీ, మత రాజకీయాలు ఇక్కడ పని చేయవు. రాబోయే రోజుల్లో ఖమ్మం ప్రజలు మీకు బుద్ధి చెబుతారు.’ అని బండి సంజయ్‌కు మంత్రి పువ్వాడ స్ట్రాంగ్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఇదే సమయంలో బీజేపీ చేసే అబద్దపు ప్రచారాలకు మోసపొవద్దని ఖమ్మం జిల్లా ప్రజలకు మంత్రి పువ్వాడ పిలుపునిచ్చారు.

Also read:

వైభవంగా కొమురవెల్లి మల్లన్న కళ్యాణ మ‌హోత్స‌వం.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు

Kona Raghupathi: ఎంతో మంది ముఖ్యమంత్రులు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.. ఆయన మాత్రమే ప్రారంభించారు: కోన రఘుపతి