తాటి చెట్టు ఎక్కేసి.. కల్లు చుక్క తాగేసి…చిందులే.. చిందులు.. జనగామ జిల్లాలో గీత కార్మికులకు కొత్త టెన్షన్
కోతికి కోతి చేష్టలు కాక మరేముంటాయి. అసలే కోతి ఆపై కల్లు తాగిందనే నానుడి గుర్తుండే ఉంటుంది. అక్షరాలా అలానే జనగామ జిల్లాలో కోతులు తాటివనంలో చేరి నానా హంగామా చేశాయి.
కోతికి కోతి చేష్టలు కాక మరేముంటాయి. అసలే కోతి ఆపై కల్లు తాగిందనే నానుడి గుర్తుండే ఉంటుంది. అక్షరాలా అలానే జనగామ జిల్లాలో కోతులు తాటివనంలో చేరి నానా హంగామా చేశాయి. తాటిచెట్లపై కుండల్లో కల్లు తాగి నానా హాంగామా చేస్తున్నాయి. దీంతో గీత కార్మికులు తలలు పట్టుకుంటున్నారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో కోతులు తాటి చెట్లు ఎక్కి కల్లు తాగుతూ, తాటి వనంలో హల్చల్ చేస్తున్నాయి. గత కొద్ది రోజులుగా తాటి చెట్లపై కుండల్లో కల్లు ఖాళీ.. అవుతుండడంతో గీత కార్మికులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరైనా దొంగిలిస్తున్నారా? అనే అనుమానంతో చెట్ల దగ్గరే కాపలా కాశారు. అయితే, కోతులు తాటి చెట్లేక్కి కుండలో కల్లు తాగుతుండడంతో ఒక్కసారిగా చూసి కంగుతిన్నారు. అక్కడే ఉన్న కొంత మంది కల్లు ప్రియులు సైతం ఆశ్చర్య పడుతూ ఆసక్తిగా కోతులు చేస్తున్న పనిని తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీస్తూ ఉండిపోయారు.
Also Read:
Fake currency: మంచిర్యాల జిల్లాలో దొంగనోట్ల కలకలం.. ఇద్దర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Jagananna Amma Vodi: ఎన్నికల కోడ్ ఉన్నా ‘అమ్మఒడి’ పథకం యథాతథం.. స్పష్టం చేసిన విద్యాశాఖ మంత్రి