తెలంగాణలో ఏ ఏ ఉత్పత్తులు ప్రత్యేకమో మీకు తెలుసా… జాబితాను సిద్ధం చేసిన ప్రభుత్వం… మీరూ చదివేయండి…
కేంద్రం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకానికి (ఓడీవోపీ) సంబంధించి పరిశ్రమలశాఖ తెలంగాణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను సిద్ధంచేసింది. జిల్లాలవారీగా..
కేంద్రం చేపట్టిన ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకానికి (ఓడీవోపీ) సంబంధించి పరిశ్రమలశాఖ తెలంగాణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను సిద్ధంచేసింది. జిల్లాలవారీగా.. ప్రాధాన్యమైన ఉత్పత్తుల జాబితాను రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తర్వాత ఈ నివేదికను కేంద్రానికి పంపిస్తారు. కాగా… దేశ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని ఉత్పత్తులకు ప్రాచుర్యం, తగిన మార్కెట్ సౌకర్యం కల్పించడం ఓడీవోపీ లక్ష్యం. ఆయా ప్రాంతాల్లో తయారుచేసే ఉత్పత్తులు, హస్తకళలు, పంటలను గుర్తించి.. ఆ జాబితాను కేంద్ర వాణిజ్యశాఖ తన వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా.. దేశంలో ఒక వస్తువు ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని కొనేలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేస్తారు. ఆయా ఉత్పత్తులకు తగిన ధర లభించేలా చర్యలు తీసుకుంటారు. ఉత్పత్తిదారు, కొనుగోలుదారు నేరుగా క్రయవిక్రయాలు జరుపుకొనేలా వీలుకల్పిస్తారు. అవసరమైతే ఉత్పత్తిదారుకు ఆర్థిక సహాయం అందిస్తారు.
తెలంగాణ జిల్లాల్లో ఏ ఏ ఉత్పత్తులు ప్రత్యేకం అంటే…
జిల్లా పంట
నిర్మల్ సోయాబీన్
మంచిర్యాల్ సెరామిక్ పైప్స్
జగిత్యాల మామిడి
కరీంనగర్ సీడ్ ప్రాసెసింగ్, గ్రానైట్ స్లాబ్స్ కటింగ్ అండ్ పాలిషింగ్, సిల్వర్ ఫిలిగ్రీ
ఆసిఫాబాద్ డోక్రా క్యాస్టింగ్స్
సంగారెడ్డి పాలు, ఉడెన్ లాకర్‌వేర్, జరీ జర్దోరీ, టైర్లు-ట్యూబ్ రీట్రింగ్ (విత్‌ఔట్ బాయిలర్), బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్
జోగుళాంబ గద్వాల వేరుశనగ, చీరలు
ఆదిలాబాద్ సోయాబీన్
జనగాం సిల్క్ చీరలు, పెంబర్తి బ్రాస్ వేర్స్
వరంగల్ రూరల్ మిరప పంట, కాటన్ డ్యూరీస్
సూర్యాపేట పాలు
పెద్దపల్లి ఎర్ర మిరప, పసుపు
భద్రాద్రి కొత్తగూడెం మిల్లెట్స్, ఎగ్ ట్రేస్, ఆయిల్‌పామ్ ప్లాంటేషన్
నల్లగొండ పవర్‌లూమ్స్, ఇత్తడి పాత్రలు, ట్రైబల్ జ్వెలరీ
కామారెడ్డి మొక్కజొన్న, బియ్యం, పత్తి
మేడ్చల్ ఆర్టీఈ స్నాక్స్, బిస్కెట్లు, ఫార్మా
మహబూబాబాద్ ధాన్యం, మిరప
రంగారెడ్డి పచ్చళ్ల తయారీ, సాస్ తయారీ, దోసకాయలు, బిస్కెట్లు, మిఠాయిలు, ప్యాకేజింగ్ మెటీరియల్
మెదక్ ప్లాస్టిక్ ఉత్పత్తులు, కేబుల్స్ తయారీ, కోళ్ల దాణా తయారీ
వికారాబాద్ జరీ జర్దోరీ వర్క్
నారాయణపేట్ చీరలు, మాంసం ఉత్పత్తులు
వరంగల్ అర్బన్ హైబ్రీడ్ మిరప
యాదాద్రి భువనగిరి పాలు, ధాన్యం, పత్తి, ఎర్ర మిరప, ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్, ఆర్ అండ్ డీ, బల్క్ డ్రగ్స్, బ్రాస్ కాస్టింగ్,
కాంస్య శిల్పాలు, పోచంపల్లి టై అండ్ డై (ఇక్కత్)
సిద్దిపేట్ గొల్లభామ శారీ, టై అండ్ డై శారీ, టవల్స్, బెడ్‌షీట్స్, షర్టింగ్, టీసీ షర్టింగ్, బాతిక్, చేర్యాల్ పెయింటింగ్, కోల్డ్ స్టోరేజెస్,
జయశంకర్ ధాన్యం ఉత్పత్తులు
ములుగు మిరప
ఖమ్మం మిరప, గ్రానైట్, టెర్రాకోట
రాజన్న సిరిసిల్ల ఫిషరీస్, చేనేత చీరలు(పవర్‌లూమ్)
మహబూబ్‌నగర్ బియ్యం, మిల్లెట్స్, కాటన్ యార్న్, రాగి ఉత్పత్తులు
హైదరాబాద్ బ్లాక్ మెటల్ క్రాఫ్ట్స్
నాగర్‌కర్నూల్ పత్తి, వేరుశనగ, మామిడి
వనపర్తి వేరుశనగ
నిజామాబాద్ ధాన్యం, మొక్కజొన్న, సోయాబీన్, పసుపు.
Also Read: