యాభై వేలు ధర నిర్ణయిస్తే లక్షా డెబ్బై ఐదు వేలు పలికింది… ట్రిపుల్ నైన్ నెంబర్‌కు అంత గిరాకీ ఎందుకు
సాధారణంగా వాహనదారులు బండికి మంచి నంబరు రావాలని కోరుకుంటారు. మరికొందరు వారికి ఇష్టమైన నంబరును ఆర్టీఏ అధికారులు...
సాధారణంగా వాహనదారులు బండికి మంచి నంబరు రావాలని కోరుకుంటారు. మరికొందరు వారికి ఇష్టమైన నంబరును ఆర్టీఏ అధికారులు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని ప్రత్యేకమైన నంబర్లకు మాత్రం ఆర్టీఏనే ధర నిర్ణయిస్తుంది. బిడ్డింగుకు పిలుస్తుంది. అయితే ఒక చోట ఆర్టీఏ అధికారులే ఆశ్చర్యపోయేలా ఓ నంబరు అధిక ధర పలికింది. ఎక్కడంటే…
వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో ఫిబ్రవరి 3న టీఎస్ 3 ఎఫ్‌బీ 0999 నంబరుకు రహస్య వేలం వేశారు. ఈ నంబరు కోసం అధికారులు నిర్ణయించిన ధర రూ.50,000 కాగా… ఆ నంబరు ఏకంగా రూ.1,75,000 పలికింది. దీంతో అధికారులే అవాక్కయ్యారు.
ఎందుకు రహస్య వేలం వేశారంటే..?
టీఎస్ 3 ఎఫ్‌బీ 0999 నంబర్ కోసం వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ముగ్గురు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆర్టీఏ అధికారులు ఒక ధరను నిర్ణయించారు. అనంతరం ముగ్గురిని రహస్య వేలంలో పాల్గొనాల్సిందిగా సూచించారు. చివరకు అధిక మొత్తం డీడీ తీసిన సందీప్ అనే వాహనదారుడికే నంబరును కేటాయించారు. అయితే 1, 99, 999, 9999 నంబర్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆయా నంబర్లు వాహనదారులు ఇష్టపడుతుండడం, వారి నమ్మకాలు, ప్రత్యేక గుర్తింపును కోరుకోవడం కారణంగానే అంత డిమాండ్ ఉంటోందని తెలిపారు.
Also Read: