KA Paul: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. హైడ్రాపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!

మొదట్లో హైడ్రా కూల్చివేతలను అభినందించిన కేఏ పాల్.. ఏపీలోనూ హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు కావాలని ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ అకాంక్షించారు. తాజాగా హైడ్రా అంటే జనానికి నిద్ర కరువు చేస్తున్న హైడ్రోజన్ బాంబు అన్నారు కేఏ పాల్.

KA Paul: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. హైడ్రాపై  కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!
Ka Paul
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 28, 2024 | 9:03 PM

ఒకవైపు హైడ్రా హడల్‌.. మరోవైపు మూసీ సుందరీకరణ గుబులు.. వెరసీ.. హైదరాబాద్ ప్రజలకు కంటిమీద కునుకు లేని పరిస్థితులు.. అటు.. మూసీ రివర్‌ బెడ్‌ పరిధిలోని ఇళ్లకు రెడ్‌ మార్క్‌లు.. ఇటు.. చెరువులు, నాలాల పరిధిలో ఉన్నాయంటూ నోటీసులు.. ఇంకేముంది.. హైదరాబాద్‌లోని పలు ఆయా ప్రాంతాలవారు వణికిపోతున్నారు. బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో కొనుగోలు చేసినవారు హైరానా పడుతున్నారు. హైడ్రా బుల్డోజర్‌ ఎప్పుడు తమపైకి వస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. తమ ఇళ్లు బఫర్‌జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయా.. తమ పరిస్థితి ఏమిటని గుబులు చెందుతున్నారు. దాంతో.. హైదరాబాద్‌లో హైడ్రాకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వీరి రాజకీయ పార్టీలు మద్దతు లభిస్తుండటంతో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.

అయితే.. మొదట హైడ్రాపై ప్రశంసలు కురవగా.. ఇప్పుడు సామాన్యులు బాధితులవుతున్న నేపథ్యంలో.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో.. పలువురు రాజకీయ నాయకులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. హైడ్రా, హైదరాబాద్ మీద పడ్డ హైడ్రోజన్ బాంబు.. పర్టిక్యులర్‌గా పేదల ఇళ్లే టార్గెట్‌గా ధ్వంసం చేసే కుట్ర.. అంటూ పొలిటికల్ బ్లాస్టింగ్ జరుగుతోంది. హైడ్రా కూల్చివేతలతో మనస్తాపం చెంది.. ఆత్మహత్య చేసుకున్నట్టు చెబుతున్న బుచ్చమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు బీఆర్ఎస్ నేతలు. హైడ్రా తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వం చేసిన హత్య.. అని విమర్శించారు.

మొదట్లో హైడ్రా కూల్చివేతలను అభినందించిన కేఏ పాల్.. ఏపీలోనూ హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు కావాలని ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ అకాంక్షించారు. నది పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా కట్టుకున్న ఇళ్లను కూల్చి వేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక తాజాగా హైడ్రా అంటే జనానికి నిద్ర కరువు చేస్తున్న హైడ్రోజన్ బాంబు అన్నారు కేఏ పాల్. హైడ్రా అనేది పొలిటికల్ డైవర్షన్ గేమ్ అని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వచ్చిన ప్రయోగమే హైడ్రా అట అంటూ ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆరోపించారు. పెద్దలను వదిలేసి పేదల ఇండ్లను కూల్చేసి రోడ్డుపాలు చేస్తున్నారని కేఏ పాల్ మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలు వెంటనే ఆపాలంటూ పాల్ డిమాండ్ చేశారు. ఇప్పటికే రోడ్డునపడ్డ పేదలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కేఏ పాల్ కోరారు. మరోవైపుఅక్రమ నిర్మాణాలకు కారణమైన అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. ఇప్పుడు హైడ్రాపై హైకోర్టులో పిటిషన్ వేసేందుకు కేఏ పాల్ సిద్ధమవుతుండటం గమనార్హం.

ఇదిలావుంటే, హైడ్రాపై అనవసర భయాలు పడొద్దంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైడ్రా అంటే బూచి కాదని.. భరోసా. ఆస్తుల పరిరక్షణ, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ హైడ్రా బాధ్యత.. తప్పుడు ప్రచారాల్ని నమ్మకండి.. అంటోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..