AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Politics: ఈ కారణంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం.. సంచలన ప్రకటన చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivasa Reddy: తెలంగాణ ఇస్తే మంచి జరుగుతుందని నాడు సోనియా భావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకపక్షం ఏం చేస్తుందో అందరికీ కనిపిస్తోంది. జనవరి 1కి ముందు, తర్వాత కూడా నేను మాట్లాడాను. ఆత్మీయ సమావేశాలు నిర్వహించి

Telangana Politics: ఈ కారణంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాం.. సంచలన ప్రకటన చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivasa Reddy
Sanjay Kasula
|

Updated on: Jun 26, 2023 | 5:42 PM

Share

ఢిల్లీ, జూన్ 26: కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. జులై 2న కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా తెలిపారు. పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇస్తే మంచి జరుగుతుందని నాడు సోనియా భావించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకపక్షం ఏం చేస్తుందో అందరికీ తెలుసన్నారు. జనవరి 1కి ముందు, తర్వాత కూడా నేను మాట్లాడాను. ఆత్మీయ సమావేశాలు నిర్వహించి ప్రజలతో మాట్లాడాం. కొందరు బయటకు చెప్పగలుగుతున్నారు. కొందరు చెప్పలేకపోతున్నారు. పదవులొక్కటే మనుషులకు ముఖ్యం కాదు. ప్రాంతీయ పార్టీ పెట్టడంపై అభిప్రాయ సేకరణ చేశాం. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని భావించామన్నాను పొంగులేటి.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనే ప్రాంతీయపార్టీ పెట్టలేదన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. భవిష్యత్తు కార్యాచరణపై ఎందరో మేధావులతో చర్చించాం. ప్రాంతీయ పార్టీలో చేరాలని మేదావులు సూచించారు. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర కాంగ్రెస్ గ్రాఫ్ పెంచింది. కర్నాటక విజయం మరింత పుంజుకుంది. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందన్నారు.

సీఎం కేసీఆర్ స్కీముల పేరుతో మాయ చేస్తున్నారని.. మాయాగారడీలో కేసీఆర్ సిద్ధహస్తుడు. అన్ని పరిణామాలు బేరీజు వేసుకుని రాహుల్ కలవాలని నిర్ణయం తీసుకున్నామని పొంగులేటి వివరణ ఇచ్చారు. కేసీఆర్ గద్దె దించాలంటే గట్టి పార్టీతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు ప్రజలు కాంగ్రెస్‌కు రుణపడి ఉన్నారని అన్నారు. ఏపీలో పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ రాష్ట్ర ఇచ్చారు. మాయమాటలు చెప్పి ఉంటే 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదన్నారు. మాయమాటలతో కేసీఆర్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారని.. ఆరు నెలల విశ్లేషణ తర్వాత కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.

కనీవిని ఎరుగని రీతిలో ఖమ్మం సభ జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభను మించి జులై 2న ఖమ్మం సభ ఉంటుందన్నారు. వ్యాపారమే ముఖ్యమనుకుంటే కాంగ్రెస్‌లో చేరేవాడిని కాదన్నారు. ఇప్పటికే తనకు ఇబ్బందులు మొదలయ్యాయని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం