Telangana: ఆ ఇద్దరు నేతల మాస్టర్ ప్లాన్.. ఏ పార్టీలో చేరకుండా.. కొత్త పార్టీ పెట్టకుండా..

బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీ చేస్తే పక్కాగా హంగ్ వస్తుందని పొంగులేటి, జూపల్లి భావిస్తున్నారట. అందుకే సరికొత్త ప్లాన్‌తో వారు ముందుకు వస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ నడుస్తుంది.

Telangana: ఆ ఇద్దరు నేతల మాస్టర్ ప్లాన్.. ఏ పార్టీలో చేరకుండా.. కొత్త పార్టీ పెట్టకుండా..
Jupally Krishna Rao And Ponguleti Srinivas Reddy
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: May 29, 2023 | 2:44 PM

తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించబోతుందా? ఆ పార్టీ గొడుగు కిందకు కేసీఆర్‌ వ్యతిరేక శక్తులు అన్నీ కలిసివస్తున్నాయా? అయితే కొత్త పార్టీ ఇప్పటికిప్పుడు సాధ్యం అవుతుందా? అందుకే దీనికి ప్రత్యమ్నాయంగా కేసీఆర్‌ వ్యతిరేక శక్తులు తెలంగాణలో ఇప్పటికే రిజిష్టర్‌ అయిన పార్టీని తీసుకుని.. ఆ పార్టీ నేతృత్వంలో పనిచేయాలనుకుంటున్నారా? ఇదంతా తెలంగాణలో కొత్తగా జరుగుతున్న పరిణామం.

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్‌ టాఫిక్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు. ఈ ఇద్దరు ఏ పార్టీలోకి చేరబోతున్నారు? కాంగ్రెస్‌లో చేరుతారా? బిజెపి కండువా కప్పుకుంటారా? అనేవి అనేక రకాల ప్రశ్నలు. అయితే ఈ ఇద్దరు ఈ సస్సెన్స్‌ కొనసాగిస్తూనే కొత్త వ్యూహానికి తెరపైకి తీసుకొస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌, బిజెపిలోకి చేరకుండానే తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా అవతరించాలని భావిస్తున్నారు. బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి ఢీకొంటే ఖచ్చితంగా తెలంగాణలో హంగ్‌ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఈ ఇద్దరు నేతలు కొత్త వ్యూహానికి తెరలేపినట్లు సమాచారం. కేసీఆర్‌ వ్యతిరేక శక్తులన్నింటిని కూడదీసుకుని ఒక శక్తిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీచేసి కనీసం 10 నుంచి 15సీట్లు గెలుచుకుని బలమైన శక్తిగా ఏర్పడి హంగ్‌ వస్తే చక్రం తిప్పాలని భావిస్తున్నారు. అందుకే ఇప్పటికే రిజిష్టర్‌ అయిన పార్టీ పేరుతో రాజకీయ ఏకీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈ నేతలు ఇటీవల యుగతులసి నేత, గతంలో వైస్సార్‌సీపీ పార్టీ పేరును జగన్‌కు ఇచ్చిన శివకుమార్‌తో కూడా భేటి అయినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ రిజిస్టర్ అయిన పార్టీ ఇంకా ఏదైనా శివకుమార్‌ దగ్గర ఉందా? ఉంటే ఇస్తారా?  అప్పట్లో జగన్‌కు వైస్సార్‌సీపీ పార్టీని ఎలా ఇచ్చారు? ఆ ప్రాసెస్ ఏంటి అన్న అంశాలకు సంబంధించి ఆరా తీసినట్లు సమాచారం.

ఈ క్రమంలో తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌తో కూడా సంప్రదింపులు జరిపారు. పొంగులేటి, జూపల్లి నేతృత్వంలో ఆత్మీయ సమ్మేళనం జరిపి ఆ సమ్మేళనానికి కోదండరామ్‌ను కూడా ఆహ్వానించారు. తెలంగాణ జనసమితి నేతృత్వంలో పొంగులేటి, జూపల్లి పనిచేయాలనుకుంటున్నారా? అనేది ఇప్పడు చర్చానీయంశమైంది. తెలంగాణలో కేసీఆర్‌ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్‌, బిజెపి అంటే గిట్టనివాల్లకు పొంగులేటి నేతృత్వంలో ఏర్పాటు కాబోయే కొత్త పార్టీ గొడుగుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది వారం రోజుల్లోనే తేలే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..