AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC: హైదరాబాద్‌ టూ కాశీ టూర్‌.. 6 రోజుల ప్యాకేజీ, ఫ్లైట్‌ జర్నీ.. ధర ఎంతంటే.

వేసవిలో చాలా మంది టూర్‌లకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్‌ రైల్వే కేటింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ప్రయాణికుల కోసం ఓ మంచి ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గంగా రామాయణ్‌ యాత్ర పేరుతో హైదరాబాద్‌ నుంచి కాశీకి ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. 5 రాత్రులు, 6 రోజులుగా ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది...

IRCTC: హైదరాబాద్‌ టూ కాశీ టూర్‌.. 6 రోజుల ప్యాకేజీ, ఫ్లైట్‌ జర్నీ.. ధర ఎంతంటే.
Hyderabad To Kashi
Narender Vaitla
|

Updated on: May 29, 2023 | 4:03 PM

Share

వేసవిలో చాలా మంది టూర్‌లకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్‌ రైల్వే కేటింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ప్రయాణికుల కోసం ఓ మంచి ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. గంగా రామాయణ్‌ యాత్ర పేరుతో హైదరాబాద్‌ నుంచి కాశీకి ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. 5 రాత్రులు, 6 రోజులుగా ఈ టూర్ ప్యాకేజీ ఉంటుంది. ప్రస్తుతం ఈ టూర్‌ జూన్‌ 7వ తేదీన అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ టూర్‌లో ఏయే ప్రాంతాలు కవర్‌ అవుతాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..

టూర్‌ సాగుతుంది ఇలా..

మొదటి రోజు: ఐఆర్‌సీటీసీ గంగా రామాయణ్ యాత్ర జూన్‌ 7వ తేదీన ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్లైట్‌ ఉదయం 9.30 గంటలకు బయలుదేరి వారణాసి విమానాశ్రయానికి ఉదయం 11.25 గంటలకు చేరుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్‌ అవ్వాల్సి ఉంటుంది. భోజనం తర్వాత కాశీ దేవాలయం, గంగా ఘాట్,సందర్శన ఉంటుంది. రాత్రి వారణాసిలోనే బస ఉంటుంది.

రెండో రోజు: రెండో రోజు సారనాథ్ సందర్శన ఉంటుంది. మధ్యాహ్నం తిరిగి వారణాసికి చేరుకుంటారు. అనంతరం బిర్లా ఆలయం దర్శించుకుంటారు. ఆ తర్వాత ఘాట్‌లను సందర్శించడం/ షాపింగ్‌ కోసం సమయం కేటాయిస్తారు. భోజనం త‌ర్వాత రాత్రి వారణాసిలో బస ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మూడో రోజు: ఇక యాత్రలో మూడో రోజు వారణాసి హోటల్‌ నుంచి చెకవుట్ అయి అయోధ్యకు బయలుదేరాల్సి ఉంటుంది. మధ్యలో ఆనంద్ భవన్, అలోపి దేవి ఆలయం, త్రివేణి సంగమం సందర్శన ఉంటుంది. సాయంత్రం అయోధ్యకు బయలుదేరి రాత్రికల్లా చేరుకుంటారు. భోజనం త‌ర్వాత రాత్రి అయోధ్యలో బస ఉంటుంది.

నాలుగో రోజు: నాలుగలో రోజు ఉదయం అయోధ్య ఆలయాన్ని సందర్శన ఉంటుంది. మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి లక్నోకి బయలుదేరాలి. అక్కడ హోటల్‌లో దిగాలి. లక్నోలో రాత్రి బస ఉంటుంది.

ఐయిదో రోజు: ఇక టూర్‌లో భాగంగా 5వ రోజు నైమిశరణ్యాన్ని దర్శనం ఉంటుంది. అక్కడ దర్శనం ముగించుకున్నాక సాయంత్రం తిరిగి లక్నో రావాల్సి ఉంటుంది. లక్నోలో రాత్రి బస చేస్తారు.

ఆరవ రోజు: చివరి రోజు ఉదయం రోజు బారా ఇమాంబరా, అంబేద్కర్ మెమోరియల్ పార్క్‌ని సందర్శిస్తారు. సాయంత్రం 6 గంటలకు లక్నో విమానాశ్రయంలో ఫ్లైట్ ఉంటుంది. అక్కడ నుంచి రాత్రి 8:00 వరకు హైదరాబాద్ వస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర వివరాలు..

ఐఆర్‌సీటీసీ గంగా రామాయణ్ యాత్ర టూర్ ప్యాకేజీ ధ‌ర విషయానికొస్తే.. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ. 36,850 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.29,900, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.28,200. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్‌సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ వంటివి కవర్ అవుతాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us