Telangana Politics: పాలేరు నీదా.. నాదా.. బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్.. ఎవరేమంటున్నారంటే..
ఖమ్మం కారులో ఉక్కపోత రోజురోజుకీ పెరిగిపోతోంది. పూటకో కొత్త పంచాయితీ తెరపైకి వస్తోంది.! సొంతపార్టీ నేతల మధ్యే టికెట్ వార్ పీక్‌కు చేరుతోంది.! పొంగులేటి ఎపిసోడ్‌తో ఇప్పటికే జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పుడు పాలేరు కేంద్రంగా అగ్గి రాజుకుంటోంది..

పాలేరు నీదా.. నాదా? ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్యే కోల్డ్ వార్ జరుగుతోంది. అందుకే పోటాపోటీగా బలప్రదర్శనలు చేస్తున్నారు. కొత్త సంవత్సరం రోజు ఆత్మీయసమ్మేళనంతో అనుచరులను పిలిచి హంగామా చేశారు బీఆర్‌ఆర్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అదే తరహాలో ఇప్పుడు పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సందడి చేశారు. ఎప్పుడూ లేని విధంగా తన బర్త్‌డే వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, అనుచరులను ఆహ్వానించారు. పెద్ద ఎత్తున దావత్ ఇచ్చారు. ఈ బర్త్ డే వేడుకతో బస్తీమే సవాల్ అంటున్నారు కందాళ ఉపేందర్ రెడ్డి.
తుమ్మల ఆత్మీయసమ్మేళనానికి ఇది కౌంటర్ అన్న చర్చ జరుగుతోంది. ఇదిలావుంటే, వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌లకే మళ్లీ టికెట్లు అంటూ సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. దీంతో తగ్గేదే లే అంటూ దూసుకుపోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి.
అయితే గత ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన తుమ్మల.. మరోసారి అక్కడి నుంచే బరిలోకి దిగేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలోనే తుమ్మల, కందాల పోటాపోటీగా సభలు నిర్వహిస్తుండటంతో.. మళ్లీ రచ్చ రాజుకుంటోంది. పాలేరులో తనకు ఎదురులేదన్నారు కందాల ఉపేందర్‌రెడ్డి. ఎవరేమి చేసినా.. ప్రజలు తనతోనే ఉంటారని అన్నారు.
ఎన్నిలతో సంబంధం లేదు.. ప్రజలతోనే ఉంటున్నా.. అందరికంటే భిన్నంగా తాను పనిస్తున్నాని అన్నారు. సమీకరణలు మారినా ఇక్కడ తాను లోకల్ అని ధీమా వ్యక్తం చేశారు. జనం తనతోనే ఉన్నారని అన్నారు. పాలేరులో వార్ వన్ సైడ్ అని తేల్చి చెప్పారు. ప్రజలు వేరే వాళ్లను ఆదరించరంటూ పరోక్షంగా తుమ్మలను టార్గెట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
