AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Traffic Rules: మీ కారు, బైక్ లేదా స్కూటర్‌ని పోలీసులు ఆపితే ఇలా చేయండి.. చలాన్ వేయకుండానే..

ఏదైనా మోటారు వాహనం (కారు, బైక్, స్కూటర్ మొదలైనవి) రహదారిపై ట్రాఫిక్ నియమాలను పాటించడం అవసరం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు మీ వాహనాన్ని కూడా ఆపితే ఏం చేయాలో మనకు ముందుగా తెలిసి ఉండాలి..

Traffic Rules: మీ కారు, బైక్ లేదా స్కూటర్‌ని పోలీసులు ఆపితే ఇలా చేయండి.. చలాన్ వేయకుండానే..
Traffic Police
Sanjay Kasula
|

Updated on: Jan 09, 2023 | 5:22 PM

Share

ట్రాఫిక్ నిబంధనలు మన జగ్రత్త కోసమే.. అదే రూల్స్‌ను బ్రేక్ చేస్తే మాత్రం ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేస్తారు. రహదారిపై ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా అవసరం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటారు. చలాన్ వేస్తారు.. కొన్ని సందర్భాల్లో నిబంధనలు బ్రేక్ చేసినందుకు వాహన యజమానిని లేదా దానిని నడుపుతున్న వ్యక్తిని జైలుకు కూడా పంపబడవచ్చు. అందుకే, మీ వాహనం ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీసులు ఆపివేస్తే.. మంచి పౌరుడిలా వారికి సహకరించడం మీ బాధ్యత. ఇలాంటి సమయంలో మీరు కొన్ని విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం ఇక్కడ తెలుసుకుందాం..

మేము ఇంతకుముందు కూడా చెప్పినట్లు ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఆపమని అడిగితే మీరు ఆపండి. అయినప్పటికీ. మీరు మీ కారు, బైక్ లేదా స్కూటర్‌పై కూర్చొని ఉండాలనుకుంటే అది మీ ఇష్టం.. ఆ తర్వాత వాహనం ఇగ్నిషన్ ఆఫ్ చేయండి. దీని తర్వాత సంయమనంతో పోలీసు అధికారితో మాట్లాడండి.

పోలీసులు కూడా మన లాంటి పౌరులు మాత్రమే అని గుర్తుంచుకోండి. ఎంతో కష్టమైనప్పటికీ ఎండలో, వానలో, చలిలో కూడా రోడ్లపై నిలబడి డ్యూటీ చేస్తుంటారు. ఎందుకంటే.. పౌరుల రక్షణ, సురక్షత కోసం. కాబట్టి, ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోండి. వారిని గౌరవించండి. వారితో మర్యాదగా ప్రవర్తించండి. మీరు ఏదైనా తీవ్రమైన నియమాన్ని ఉల్లంఘించనట్లయితే.. వారు కేవలం హెచ్చరికతో మిమ్మల్ని వెళ్లనివ్వవచ్చు.

ట్రాఫిక్ పోలీసుతో మాట్లాడుతున్నప్పుడు ఆవేశపడకండి. మీరు పొరపాటున ఏదైనా ట్రాఫిక్ నియమాన్ని ఉల్లంఘించినట్లయితే.. అసలు విషయం ఏంటో వారికి వివరించడానికి ప్రయత్నించండి. అవసరమైతే, మీరు ఏదైనా పొరపాటు చేసి ఉంటే క్షమాపణ అడగవచ్చు. వారు పొరపాటున ఆపి ఉంటే వారుకూడా క్షమాపణ చెప్పే అవకాశం ఉంది.

నియమాలను గౌరవించండి..

నియమాలు అందరికీ ఉంటాయి. ముందుగా మనం గుర్తుంచుకోవల్సినంది ఏంటంటే.. ఈ నియమాలను మనం.. మన కోసం ఏర్పాటు చేసుకున్నవి మాత్రమే. అందుకే వాటిని అనుసరించాలి. అందుకే ప్రశంతంగా పోలీసుతో మాట్లాడండి. మీరు నియమాన్ని ఉల్లంఘిస్తే.. మీపై చర్య తీసుకోవడం.. వారి విధిని చేయనివ్వడం వారి విధి అని అర్థం చేసుకోండి. ఇలాంటి సమయంలో మీరు రూల్ ఎందుకు బ్రేక్ చేయాల్సి వచ్చిందో కూడా చెప్పవచ్చు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం