AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాచారం పెయింటర్ హత్య కేసులో వెలుగులోకి సంచలనాలు.. లిఫ్ట్‌ ఇస్తామని తీసుకెళ్లి.. !

హైదరాబాద్ మహానగరం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడిని ఉప్పల్ కళ్యాణపురికి చెందిన పెయింటర్ మురళీకృష్ణగా గుర్తించారు. మురళీకృష్ణ కూలీ పనులు చేస్తుండగా, ఆయన భార్య అదే ప్రాంతంలోని ఓ ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేస్తోంది. తనకు జరిగి విషయాన్ని స్థానికులతో చెప్పి పెయింటర్‌ మురళీకృష్ణ చనిపోయాడు

నాచారం పెయింటర్ హత్య కేసులో వెలుగులోకి సంచలనాలు.. లిఫ్ట్‌ ఇస్తామని తీసుకెళ్లి.. !
Nacharam Crime
Balaraju Goud
|

Updated on: Nov 05, 2025 | 10:29 AM

Share

హైదరాబాద్ మహానగరం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతుడిని ఉప్పల్ కళ్యాణపురికి చెందిన పెయింటర్ మురళీకృష్ణగా గుర్తించారు. మురళీకృష్ణ కూలీ పనులు చేస్తుండగా, ఆయన భార్య అదే ప్రాంతంలోని ఓ ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేస్తోంది. తనకు జరిగి విషయాన్ని స్థానికులతో చెప్పి పెయింటర్‌ మురళీకృష్ణ చనిపోయాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఉప్పల్‌ కల్యాణపురికి చెందిన పెయింటర్‌ మురళీకృష్ణ, కూలీ పని కోసం ఎల్బీనగర్ వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో ఎల్బీనగర్‌ నుంచి ఉప్పల్‌ వరకు లిఫ్ట్‌ అడిగాడు. లిఫ్ట్‌ ఇస్తామని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు కారు డ్రైవర్. కారు డ్రైవర్‌కు అతని నలుగురు స్నేహితులు జత కలిశారు. పెయింటర్‌ను నాచారం పారిశ్రామిక వాడ ప్రాంతంలోకి తీసుకెళ్లి నలుగురు కలిసి అతనిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. NGRI వద్దకు వచ్చాక బాధితుడు కారులో నుంచి దూకేశాడు.

అనంతరం మురళీకృష్ణను వెంటాడిన నలుగురు యువకులు కత్తితో 8సార్లు పొడిచారు. వారి నుంచి రోడ్డుపై తప్పించుకుని పరిగెత్తుతూ వెళ్లి పడిపోయాడు. అయితే అతను చనిపోయాడనుకున్న నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అతని గమనించిన స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించారు. కాగా, తనకు జరిగి విషయాన్ని స్థానికులతో చెప్పిన పెయింటర్‌ మురళీకృష్ణ ప్రాణాలు విడిచాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఈ కేసులో దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాచారం రాఘవేంద్రనగర్‌కు చెందిన మహమ్మద్‌ జునైద్‌ అలియాస్‌ జాఫర్‌, ఇందిరానగర్‌ వాసి షేక్‌ సైఫుద్దీన్‌, కార్తికేయనగర్‌లో ఉండే పొన్నా మణికంఠ, మల్లాపూర్‌కు చెందిన మైనర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
ఐఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌!
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ
రోహిత్, కోహ్లీలతోపాటు టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాకిచ్చిన బీసీసీఐ
రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
రూ.10 లక్షలలోపు బెస్ట్‌ మైలేజీ ఇచ్చే కార్లు ఇవే..!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
మరో దారుణం.. అర్ధరాత్రి కత్తులతో పొడిచి యువకుడి హత్య!
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
రామా లేదా కృష్ణ! ఇంట్లో ఏ తులసి మొక్కను నాటడం శుభప్రదం..?నిపుణులు
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
టెస్ట్ బ్యాటర్‌గా స్టాంప్.. 8 సిక్సర్లు, 13 ఫోర్లతో బీభత్సం
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
తక్కువ ధరలో సన్‌రూఫ్‌తో వచ్చే టాప్‌ 4 కార్లు ఇవే!
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
ఉదయం పూట ఈ వ్యక్తులు టీ తాగితే బాడీ షెడ్డుకే.. అసలు విషయం..
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
2026లో మారుతి సుజుకి బిగ్ బ్యాంగ్..కొత్త అప్‌డేట్స్‌తో 4 కార్లు!
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు
శీతాకాలంలో మాత్రమే లభించే టర్నిప్ కూరగాయ గురించి తెలుసా? లాభాలు