Etela Rajender: పదో తరగతి ప్రశ్నపత్రాల కేసులో ఈటల రాజేందర్‌కు నోటీసులు.. శుక్రవారం విచారణకు రావాలంటూ..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కోర్టులో ఉండగానే.. ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం విచారణకు రావాలంటూ..

పదో తరగతి ప్రశ్నపత్రాల కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు. పదో తరగతి ప్రశ్నాపత్రాలు వ్యవహారంలో పెద్ద ఎత్తున లీగల్‌గా పెద్దయుద్ధమే నడుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కోర్టులో ఉండగానే.. ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. శుక్రవారం విచారణకు రావాలంటూ వరంగల్ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. వరంగల్ DCP కార్యాలయంలో విచారణ ఉంటుందన్నారు. CRPC 160 కింద నోటీసులు ఇచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. శామీర్‌పేటలో నివాసానికి వచ్చి నోటీసులు ఇచ్చారు పోలీసులు.
ఈటల రాజేందర్‌కు మొన్న వాట్సాప్‌లో పేపర్ పంపిన A2-ప్రశాంత్.. కమలాపూర్‌లో పేపర్ లీక్‌పై ఈటల రాజేందర్ నుంచి స్టేట్‌మెంట్ రికార్డు చేయనున్నారు వరంగల్ పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం
