Telanagana: మరీ అంత ఈజీగా ఎలా నమ్ముతార్రా?.. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏం చేశాడో తెలుసా?
ప్రస్తుత రోజుల్లో ఉద్యోగాలకు ఉన్న కాంపిటేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏటా లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలతో బయటకు వచ్చి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో వారికి సరిపడా ఉద్యోగాలు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది నిరుద్యోగులుగా మిగులుతున్నారు. అయితే కొందరు కేటుగాళ్లు ఈ నిరుద్యోగుల బలహీనతలను ఆసరా చేసుకుని డబ్బులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ దేవేందర్ అనే యువకుడు ప్రభుత్వ కార్యాలయాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల ఇప్పిస్థానని చెప్పి అమాయకలకు కుచ్చుటోపీ పెట్టాడు.

వివరాల్లోకి వెళితే… ఖమ్మం జిల్లాకు చెందిన మట్టే దేవేందర్ కొంతకాలం స్థానికంగా రిపోర్టర్ గా పనిచేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి సూర్యాపేటకు మకాం మార్చిన దేవేందర్. అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు ప్లాన్ వేశాడు. ఈక్రమంలో సూర్యాపేట మెడికల్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉన్నాయిని నిరుద్యోగులకు వలవేశాడు. కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్ వంటి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 14మంది నిరుద్యోగుల నుంచి సుమారు రు.18 లక్షలు వసూళ్లు చేశాడు. అయితే ఏడాది గడుస్తున్నా ఉద్యోగాలు రావపోడంతో నిరుద్యోగులు అతన్ని ప్రశ్నించారు. దీంతో దేవేందర్ డబ్బులు తిరిగి ఇస్తానని కొందరికి బాండ్ పేపర్లు కూడా రాసి ఇచ్చినట్టు సమాచారం. కానీ వాళ్లకు డబ్బులూ ఇవ్వలేదు.. ఉద్యోగాలు ఇప్పించలేదు. దీంతో దేవేందర్ తీరుపై బాధితులు గత ఫిబ్రవరి నెలలో సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.
అయితే పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని దేవేందర్ హైకోర్టు ను ఆశ్రయించారు. అయితే పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు బెయిల్ రిజెక్ట్ చేసి పోలీసులకు సరెండర్ కావాలని కోర్ట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేవేందర్ సూర్యాపేట టౌన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అయితే కేసు దర్యాప్తులో ఉందని.. కచ్చితంగా బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేసి.. డబ్బులు వసూలు చేసే వారిని నమ్మొద్దని కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి కోరారు. అలా ఎవరైన ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తే వారి వివరాలను తమకు ఇవ్వాలని ఆయన సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
