AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fire Accident: యాదాద్రి పవర్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పించుకున్న కార్మికులు!

నల్లగొండ జిల్లా దామరచర్ల (మం) వీర్లపాలెంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. అయితే మంటలను సకాలంలో అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్లాంట్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Fire Accident: యాదాద్రి పవర్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పించుకున్న కార్మికులు!
Yadadri Fire Accident
M Revan Reddy
| Edited By: |

Updated on: Apr 28, 2025 | 11:34 AM

Share

రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ కోసం గత ప్రభుత్వం వీర్లపాలెం వద్ద సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో  (YTPS ) నిర్మాణాన్ని తెలంగాణ జెన్కో చేపట్టింది. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో ఐదు యూనిట్లను నిర్మిస్తోంది. అయితే గత ఏడాది  ప్రస్తుత సీఎం సీఎం రేవంత్ రెడ్డి 2, 3 యూనిట్లను జాతికి అంకితం చేశారు. మిగిలిన మూడు యూనిట్లను కూడా విద్యుత్ ఉత్పత్తికి సిద్ధం చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెలలో యూనిట్ – 1ను ప్రారంభించేందుకు అధికారులు ట్రయల్ రన్ చేస్తున్నారు. ఈ క్రమంలో యూనిట్ – 1 బాయిలర్‌కు ఆయిల్ సప్లై చేసే పైప్ లీక్ అయ్యింది. అదే సమయంలో కింద వెల్డింగ్ పనులు చేస్తుండటంతో.. ఆ నిప్పు రవ్వలు అయిల్‌పై పడడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు యూనిట్‌ మొత్తానికి వ్యాపించాయి.

ప్రమాద సమయంలో కార్మికులు దూరంగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదం కారణంగా ప్లాంట్‌లో 600 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కాగా ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ట్రయల్ రన్ చేసేటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడం సహజమే అని థర్మల్ పవర్‌ ప్లాంట్ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…