AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఖాకీలో కన్నతల్లి ప్రేమ.. పోలీసుల సరికొత్త ప్రయోగం.. అసలు మ్యాటరేంటంటే?

పోలీస్ స్టేషన్ అంటే ఇప్పటికీ చాలా మంది మహిళలకు భయం. బాధతో వెళ్లినా, తమ సమస్యను ఎలా చెప్పాలన్న సంకోచం. కేసు నమోదు అవుతుందో లేదో అన్న అనుమానం.. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలకు అండగా నిలవడానికి పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పోలీసులు తీసుకొచ్చిన ఆ కొత్త కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Telangana: ఖాకీలో కన్నతల్లి ప్రేమ.. పోలీసుల సరికొత్త ప్రయోగం.. అసలు మ్యాటరేంటంటే?
Women Police Initiative
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 10:17 AM

Share

మహిళల భద్రతతో పాటు నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చేలా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే మహిళా హెల్ప్‌లైన్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. నిర్భయ చట్టాలు, షీ టీమ్స్ వంటి అనేక కార్యక్రమాలను చేపడుతోంది. అయినా మహిళలపై నేరాలు తగ్గడం లేదు. గృహ హింస, వేధింపులు, లైంగిక నేరాల బాధితులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడి తమ బాధను పూర్తిగా బయట పెట్టలేక పోతుంటారు. ఈ మానసిక అడ్డంకిని తొలగించేందుకు సూర్యాపేట జిల్లా పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ అక్క అనే కొత్త కాన్సెఫ్ట్‌ను తీసుకొచ్చారు. ఖాకీకి మానవీయ ముఖమే పోలీస్ అక్క. ఇంతకూ ఈ కాన్సెప్ట్ ఎలా పనిచేస్తుంది అంటే?

పోలీస్ అక్క..

పోలీస్ స్టేషన్‌లోకి వచ్చిన మహిళకు మొదటి పలకరింపు నుంచి చివరి వరకు ఒక మహిళా పోలీస్ అండగా ఉండనుంది. మహిళల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నం పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం పెరగాలంటే. ముందుగా పోలీస్ స్టేషన్ గడప దాటే వ్యక్తికి ఆత్మ విశ్వాసం కలగాలి. అందుకే మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి బాధితులతో ఎలా మాట్లాడాలి? మానసికంగా ఎలా ధైర్యం చెప్పాలి? చట్టపరమైన సహాయం ఎలా అందించాలి? కుటుంబ వివాదాల్లో ఎలా స్పందించాలి? అనే అంశాలపై మహిళా పోలీసులకు అవగాహన కల్పిస్తున్నారు.

సమాజంలో మహిళలు, పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థినీలకు దైర్యం కల్పించడం, పోలీసు స్టేషన్ కు వచ్చే మహిళా ఫిర్యాదుదారులకు, బాధితులకు భరోసా కల్పించి, స్నేహపూర్వక వాతావరణంలో వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చేయడం ఈ పోలీస్ అక్క కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా ఎస్పీ నరసింహ చెబుతున్నారు. మహిళలు, విద్యార్థినులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడకుండా తమ సమస్యలను ఒక సొంత అక్కతో పంచుకున్నట్లు పోలీసులతో పంచుకునేలా చేయడమే తమ లక్ష్యమన్నారు.

పోలీసు స్టేషన్ కు వచ్చే బాధితులకు భద్రత, భరోసా కల్పించడంతో పాటుగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బాలికల విద్యాలయాలను, కాలనీలోని మహిళా సంఘాలను సందర్శించి మహిళల రక్షణ చట్టాల గురించి, షీ టీం, బరోసా పోలీస్, పోక్సో చట్టాల గురించి అవగాహన కల్పిస్తారని అన్నారు. నెలలో ఒక రోజు బాలికల హాస్టల్స్ నందు నిద్రించి స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించి, పోలీస్ యూనిఫాం ధరించి పోలీస్ అక్క ఆదర్శంగా ఉండాలని మహిళా కానిస్టేబుల్స్ ను కోరారు.

పోలీస్ అక్క కాన్సెప్ట్ విజయవంతమైతే.. మహిళల ఫిర్యాదులు పెరగడంతోపాటు గృహహింస కేసులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. బాలికలపై నేరాల నివారణలో ఉపయోగపడవచ్చు. పోలీస్ వ్యవస్థపై మహిళల నమ్మకం కలగవచ్చు. అయితే సిబ్బంది కొరత ఇతర కారణాలతో ఈ కాన్సెప్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us