Central Government: ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే స్కీమ్.. మీరూ పొందవచ్చు..
పోస్టాఫీసు పథకాలు ఇటీవల బాగా పాపులర్ అయ్యాయి. కానీ ఈ పథకంలో ఒకసారి పెట్టుబడి పెడితే ఐదేళ్లల్లోనే భారీగా ఆదాయం పొందవచ్చు. ప్రతీ నెలా మీ అకౌంట్లో డబ్బులు పడుతూనే ఉంటాయి. వీటిని మీరు ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. స్కీమ్ వివరాలు చూద్దాం.

మీ దగ్గర ఉన్న డబ్బులను పొదుపు చేసుకుని ఆదాయం పొందేందుకు ప్రస్తుతం అనేక మార్గాలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, బంగారం, బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకాలు, పోస్టాఫీస్ స్కీమ్స్ లాంటివి చాలానే ఉన్నాయి. స్టాక్ మార్కెట్ చాలా రిస్క్‌తో కూడుకున్నది కావడంతో ఎవరూ సాహసించరు. ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా కాస్త రిస్క్ ఉంటుంది. ఇక ఎలాంటి రిస్క్ లేకుండా ఎక్కువ ఆదాయం పొందాలంటే బెస్ట్ ఆప్షన్ పోస్టాఫీస్ స్కీమ్స్. దీంతో పోస్టాఫీస్ పొదుపు పథకాలు అనేకం దేశంలో బాగా పాపులర్ అయ్యాయి. పోస్టాఫీసుల్లో అనేక స్కీమ్స్ ఉండగా. వాటిల్లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ అనేది ఇటీవల బాగా పాపులర్ అవుతోంది. ఒకేసారి పెట్టుబడి పెట్టి ప్రతీ నెలా ఆదాయం పొందాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. ఈ స్కీమ్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎవరెవరు పెట్టుబడి పెట్టవచ్చు..?
ఈ పథకంలో ఎవరైనా చేరవచ్చు. మైనర్లు ఉంటే వారి పేరిట తల్లిదండ్రులు కూడా పెట్టుబడి పెట్టే అవకాశం ఈ పథకంలో ఉంది. కనీస పెట్టుబడి రూ.వెయ్యితో ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి విషయానికొస్తే.. సింగిల్ అకౌంట్ కింద అయితే రూ.9 లక్షల వరకు ఛాన్స్ ఉంది. ఇక జాయింట్ అకౌంట్ అయితే రూ.15 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఒకేసారి లంప్సమ్ అమౌంట్ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఐదేళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అనంతరం మెచ్యూరిటీ టైమ్ అయ్యాక వడ్డీతో సహా ఒకేసారి మొత్తం సొమ్ము తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. ప్రతీ నెలా వడ్డీ మీ అకౌంట్లో పడుతుంది. వీటిని ఒకేసారి ఐదేళ్ల తర్వాత తీసుకోవచ్చు. మీరు పెట్టిన పెట్టుబడికి ప్రతీ నెలా ఆదాయం వస్తూనే ఉంటుంది. మీరు ప్రతీ నెలా దీనిని చెక్ చేసుకోవచ్చు.
ఐదేళ్ల తర్వాత ఎంత వస్తుంది..?
అయితే ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ కంటే ముందే మీరు డబ్బులు తీసుకోవాలంటే జరిమానా పడుతుంది. ఏడాది నుంచి 3 ఏళ్ల మధ్యలో తీసుకుంటే మీరు డిపాజిట్ చేసిన అమౌంట్లో నుంచి 2 శాత కోత విధిస్తారు. ఇక 3 నుంచి 5 ఏళ్ల మధ్య తీసుకుంటే ఒక శాతం కట్ అవుతుంది. ఉదాహరణకు మీరు ఈ స్కీములో రూ.5 లక్షలు ఒకేసారి జమ చేశారనుకుందాం. ప్రస్తుతం ఉన్న 7.40 శాతం వడ్డీ ప్రకారం ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.3083 వడ్డీ లభిస్తుంది. అంటే ఏడాదికి రూ.36,996 వస్తాయి. ఐదేళ్ల తర్వాత రూ.5 లక్షల అమౌంట్‌పై రూ.1,84,980 వడ్డీ అందుతుంది. ఇక రూ.9 లక్షలు జమ చేస్తే ప్రతీ నెలా రూ.5,550 వస్తాయి. అంటే ఏడాదికి రూ.66,600 అందుతాయి. ఐదేళ్లకు రూ.3.33 లక్షలు పొందుతారు.
