పిల్లల ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి పెట్టే ఆహారం విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.
పిల్లల ఆరోగ్యం
అయితే పిల్లలు రైస్ తినడానికి కూడా అస్సలే ఇష్టపడరు. దీంతో తల్లులు రక రకాల వంటలు చేసి పెడుతుంటారు.
అనేక రకాల వంటకాలు
ముఖ్యంగా పిల్లలు త్వరగా బరువు పెరగాలని వారికి మంచి ఆహారం పెడుతుంటారు. అయితే ఈ రకంగా కిచిడీ తయారు చేసి పెడితే రుచి మాత్రమే కాకుండా, పిల్లలు బరువు కూడా పెరుగుతారంట.
బరువు పెరగడం
కిచిడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. ఒక కప్పు పెసరపప్పు, కప్పు బియ్యం, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, అల్లం, వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, నల్ల మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, నీరు
కావాల్సిన పదార్థాలు
ముందుగా పెసరపప్పు బియ్యం, తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి దాదాపు 30 నిమిషాల పాటు నానబెట్టాలి.
పెసరపప్పు, బియ్యం
ముందుగా ఒక టీ స్పూన్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి వేడి చేసిన తర్వాత అందులో అల్లం ముక్క,తరిగిన వెల్లుల్లి, ఇంగువర, ఆవాలు అన్నీ వేయాలి.
నెయ్యి వేడి చేయడం
నల్ల మిరియాలు, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో నీళ్లు వేసి మరగబెట్టుకోవాలి.
నీళ్లు వేసి ఉడకబెట్టడం
తర్వాత నీళ్లు బాగా మరిగిన తర్వాత అందులో బియ్యం, పెసరపప్పు అన్నీ వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. చిటికెడు ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలి.