AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇద్దరుంటే భయపడాలా ఏంది.. 3-0తో చిత్తుగా ఓడిస్తాం.. సవాల్ చేసిన ఇంగ్లాండ్ కోచ్..!

Brendon McCullum comments on Team India: ఇంగ్లాండ్ కోచ్ విసిరిన ఈ సవాల్ ఇప్పుడు మ్యాచ్‌పై ఉత్కంఠను మరింత పెంచింది. గాయపడిన సింహం లాంటి టీం ఇండియా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల నేతృత్వంలో మైదానంలోకి దిగి మెకల్లమ్ విసిరిన సవాలుకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రేపు జరిగే తొలి పోరులో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి!

ఆ ఇద్దరుంటే భయపడాలా ఏంది.. 3-0తో చిత్తుగా ఓడిస్తాం.. సవాల్ చేసిన ఇంగ్లాండ్ కోచ్..!
Brendon Mccullum Comments On Team India
Venkata Chari
|

Updated on: Jul 14, 2026 | 9:02 AM

Share

Brendon McCullum comments on Team India: ఇంగ్లాండ్ పర్యటనలో ఎదురైన ఘోర పరాభవం తర్వాత టీం ఇండియా మరో అగ్నిపరీక్షకు సిద్ధమైంది. టి20 సిరీస్‌ను కోల్పోయి అగ్రస్థానాన్ని పోగొట్టుకున్న భారత్, ఇప్పుడు వన్డే సిరీస్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని కసితో ఉంది. ఈ తరుణంలో ఇరు జట్ల మధ్య రేపటి నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందే ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ టీం ఇండియాను హెచ్చరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అవమాన భారం నుంచి ప్రతీకారానికి సై.. రేపటి నుంచే అసలైన సమరం!

భారత జట్టు యూకే పర్యటనలో టి20 సిరీస్‌ను భారీ తేడాతో కోల్పోవడమే కాకుండా, ఐసీసీ నెంబర్ వన్ ర్యాంకును కూడా చేజార్చుకుంది. ఈ అవమానానికి వన్డే సిరీస్‌లో ఎలాగైనా బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన పట్టుదలగా ఉంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జూలై 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఇదికూడా చదవండి: Team India: రోహిత్ ఒక్కడే కాదు భయ్యో.. ఆ ముగ్గురికి చావో రేవో సిరీస్.. టార్గెట్ మాత్రం అదే..?

ఈ సిరీస్ షెడ్యూల్ పరిశీలిస్తే, తొలి వన్డే మ్యాచ్ రేపు బర్మింగ్హామ్‌లోని ప్రసిద్ధ ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనుంది. ఆ తర్వాత రెండో వన్డే మ్యాచ్ 16వ తేదీన కార్డిఫ్ మైదానంలో, ఇక ఆఖరి వన్డే మ్యాచ్ 19వ తేదీన చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగనున్నాయి. తొలి వన్డే మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది.

రోహిత్, కోహ్లీ వస్తున్నా భయం లేదు.. మూడు సున్నాతో ఓడిస్తాం: మెకల్లమ్ హుంకర్!

టి20 సిరీస్‌ను కైవసం చేసుకున్న జోష్‌లో ఉన్న ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే మైండ్ గేమ్ మొదలుపెట్టాడు. టి20 సిరీస్‌లో టీం ఇండియాను పక్కా ప్రణాళికతో దెబ్బకొట్టామని వివరించిన మెకల్లమ్, ఇప్పుడు వన్డే సిరీస్‌లోనూ అదే పునరావృతం చేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

ఇదికూడా చదవండి: టీమిండియాలో ఆ ముగ్గురి చాప్టర్ క్లోజ్.. ఇంగ్లాండ్ సిరీస్ ఓటమితో ఇక జట్టులో నో ప్లేస్..?

వన్డే సిరీస్ కోసం భారత జట్టులోకి విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ వంటి దిగ్గజ ఆటగాళ్లు పునరాగమనం చేస్తున్నారని, అలాగే జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్‌లు కూడా రంగంలోకి దిగుతున్నారని తమకు తెలుసని అన్నాడు. అయితే ఎంతటి దిగ్గజాలు వచ్చినా తాము భయపడబోమని, వారిని అడ్డుకునేందుకు సరికొత్త వ్యూహాలు సిద్ధం చేశామని సవాల్ విసిరాడు. ముఖ్యంగా ప్రమాదకరమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఎలా ఎదుర్కోవాలో తమ బ్యాటర్లకు పక్కా ప్లాన్ ఇచ్చామని, ఈ వన్డే సిరీస్‌లో కూడా భారత్‌ను మూడు సున్నాతో క్లీన్ స్వీప్ చేసి పంపుతామని మెకల్లమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

పరిమిత ఓవర్లపైనే మెకల్లమ్ దృష్టి.. భారత్ బదులిస్తుందా?

నిజానికి టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్ కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయాడు. వ్యూహాలు పారకపోవడంతో అతడిని టెస్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పించారు. ప్రస్తుతం అతను కేవలం వన్డే, టీ20 ఫార్మాట్ల బాధ్యతలను మాత్రమే చూసుకుంటున్నాడు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన ముద్ర వేయడానికి మెకల్లమ్ భారత్‌పై ఇలాంటి కఠిన వ్యూహాలు పన్నుతున్నాడు.

ఇదికూడా చదవండి: కొంపముంచిన 7 మ్యాచ్‌లు.. 2028 టీ20 ప్రపంచకప్‌ రేసు నుంచి ముగ్గురు భారత ఆటగాళ్లు ఔట్..?

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us