AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మొబైల్ టార్చ్ వెలుతురులో.. కారు చీకట్లో.. ఓ నిండు గర్భిణీ నరకయాతన!

తరాలు మారినా ఆ అడవి బిడ్డల తలరాతలు మారడం లేదు. ఆధునిక యుగంలోనూ వారికి అష్ట కష్టాలే. మారుమూల ప్రాంతాలకు రహదారులు లేక అత్యవసర సమయంలో వారి కష్టాలు అన్ని ఇన్ని కావు. రోగమొచ్చినా రోస్టొచ్చినా డోలీమోయాల్సిందే.. వాగులు రాళ్లు రప్పలు దాటుకుంటూ ముందుకు సాగాల్సిందే! తాజాగా ఓ నిండు గర్భిణి పడిన కష్టం మరోసారి రహదారులేక గిరిజనులు పడుతున్న అవస్థలకు అద్దం పడుతోంది..

Watch Video: మొబైల్ టార్చ్ వెలుతురులో.. కారు చీకట్లో.. ఓ నిండు గర్భిణీ నరకయాతన!
Pregnant Woman Carried In Doli
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 14, 2026 | 10:12 AM

Share

దేవరపల్లి, జులై 14: అల్లూరి జిల్లా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల రహదారు లేక అవస్థలు పడుతూ ఉన్నారు. తాజాగా జికేవిద్య మండలం దేవరపల్లి పంచాయతీ నక్కబంద గ్రామం నుంచి ఓ గర్భిణీ డోలి కష్టాలు వీడియో వైరల్ అవుతుంది. సాంగి సంధ్యా అనే గిరిజన మహిళ నిండు గర్భిణీ. పురిటి నొప్పులు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లాలి. చీకటి పడింది.. గ్రామానికి అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రహదారి సౌకర్యం అంతంత మాత్రమే. ఆ రహదారి మధ్యలో మరో కాలువ. ఆ కాలువ దాటి వాహనాలు వచ్చే పరిస్థితి ఉండదు. దీంతో ఇక.. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డోలి కట్టారు. ఆ గర్భిణీకి డోలీమోసారు. కారు చీకట్లో రాళ్ళూ రెప్పలు దాటుకుంటూ ముందుకు వెళ్లారు. మొబైల్ టార్చ్ లైట్ వెలుతురులోనే దారి చూసుకుంటూ ముందుకు సాగారు.

ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ.. ఆ గర్భిణీలో ధైర్యం నింపుతూ డోలి మోసారు. దాదాపు కిలోమీటర్ల పైగా లక్కవరం వరకు ఆమెను మోసుకుంటూ వెళ్లారు. లక్కవరం నుంచి గూడెం కొత్త వీధి వరకు అంబులెన్స్ లో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆ గిరిజన మహిళ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తమ గ్రామానికి రహదారి సౌకర్యం అంతంత మాత్రమే ఉండడంతో పాటు.. మధ్యలో కాలువ కారణంగా వాహనం రాలేకపోయిందని.. అందుకే డోలి మోయాల్సి వచ్చిందని అంటున్నారు గిరిజనులు. ఈ డోలి కష్టాలు తమకు తీర్చాలని కోరుతున్నారు.

Follow Us
మొబైల్ టార్చ్ వెలుతురులో.. కారు చీకట్లో.. ఓ గర్భిణీ నరకయాతన!
మొబైల్ టార్చ్ వెలుతురులో.. కారు చీకట్లో.. ఓ గర్భిణీ నరకయాతన!
వాస్తు టిప్స్ : ఇంటి ముందు అల్ల నేరేడు చెట్టు ఉండటం మంచిదేనా?
వాస్తు టిప్స్ : ఇంటి ముందు అల్ల నేరేడు చెట్టు ఉండటం మంచిదేనా?
పైనచూస్తే తెల్లటి సంచులు.. డౌట్ వచ్చి విప్పి చూడగా..
పైనచూస్తే తెల్లటి సంచులు.. డౌట్ వచ్చి విప్పి చూడగా..
మాటల్లో కాదు చేతల్లో చూపాలి.. విజయశాంతి సంచలన ట్వీట్..
మాటల్లో కాదు చేతల్లో చూపాలి.. విజయశాంతి సంచలన ట్వీట్..
ప్రతీ నెలా అకౌంట్లోకి నేరుగా రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్..
ప్రతీ నెలా అకౌంట్లోకి నేరుగా రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్..
POCSO కేసులు తగ్గించేందుకు కేంద్రం కొత్త వ్యూహం.. అసలు సంగతి ఇదే
POCSO కేసులు తగ్గించేందుకు కేంద్రం కొత్త వ్యూహం.. అసలు సంగతి ఇదే
కోపంతో భర్త తలపై మొబైల్‌తో కొట్టిన భార్య..! అతడు మృతి
కోపంతో భర్త తలపై మొబైల్‌తో కొట్టిన భార్య..! అతడు మృతి
ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి రూ.20 వేలు
ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి రూ.20 వేలు
ఆ ఇద్దరు ఉంటే భయపడాలా ఏంది.. 3-0తో చిత్తుగా ఓడిస్తాం
ఆ ఇద్దరు ఉంటే భయపడాలా ఏంది.. 3-0తో చిత్తుగా ఓడిస్తాం
ఐఫోన్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్స్‌తో 18 సిరీస్
ఐఫోన్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్స్‌తో 18 సిరీస్