AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: పాలమూరు వేదికగా రూ.13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. ప్రధాని మోడీ స్పీచ్‌పై సర్వత్రా ఉత్కంఠ..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలోని పాలమూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని మోదీ. వెంటనే ఒంటి గంట 35 నిమిషాలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌ నగర్‌ వెళ్తారు.

PM Modi: పాలమూరు వేదికగా రూ.13 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం.. ప్రధాని మోడీ స్పీచ్‌పై సర్వత్రా ఉత్కంఠ..
PM Modi
Shaik Madar Saheb
|

Updated on: Oct 01, 2023 | 8:06 AM

Share

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలోని పాలమూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు ప్రధాని మోదీ. వెంటనే ఒంటి గంట 35 నిమిషాలకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌ నగర్‌ వెళ్తారు. 2 గంటల 5 నిమిషాలకు పాలమూరు జిల్లాకు చేరుకుంటారు మోదీ. 2గంటల 15నిమిషాల నుంచి 2గంటల 50 నిమిషాల వరకు భుత్పుర్ ఐటిఐ కళాశాల ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.. శంకుస్థాపనలు చేస్తారు ప్రధాని.. అనంతరం 3గంటలకు పక్కనే ఉన్న పాలమూరు ప్రజా గర్జన సభాస్థలికి చేరుకుంటారు మోదీ. 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 4గంటల 15నిమిషాలకు హెలికాప్టర్‌లో శంషాబాద్‌ విమానశ్రయానికి బయలుదేరుతారు. అనంతరం ప్రధాని 4గంటల 45 నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని.. ఢిల్లీకి తిరిగి పయనం అవుతారు.

రూ.13,500 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..

పాలమూరు పర్యటనలో జాతీయ రహదారులు, రైలు మార్గాలు, పెట్రోలియం – సహజ వాయువు, ఉన్నత విద్యలకు సంబంధించి దాదాపుగా రూ.13వేల 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని. నాగ్ పుర్- విజయవాడ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా రోడ్డు ప్రాజెక్టుకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే 90 కి.మీ. పొడవైన ఫోర్ లైన్ యాక్సెస్ తో కూడిన ఖమ్మం టు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు ప్రధాని శ్రీకారం చుడతారు. రూ. 500 కోట్ల వ్యయంతో నిర్మించిన 37 కి.మీటర్ల జక్లేరు-కృష్ణా న్యూ రైల్వే లైన్‌ను కూడా దేశప్రజలకు జాతీయం చేస్తారు ప్రధాని. ఈ రైలు మార్గం నారాయణపేట జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలను రైలు మార్గాల ద్వారా చిత్రపటంలోకి తీసుకురానున్నారు. అలాగే హైదరాబాద్ టు రాయ్‌చూర్, రాయ్‌చూర్‌ టు హైదరాబాద్ కి తొలి రైల్వే సర్వీసును ప్రధాని ప్రారంభిస్తారు. చమురు, గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టులను శంకుస్థాపనతో పాటు వాటిని జాతికి అంకితమివ్వనున్నారు ప్రధాని మోదీ. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన అయిదు క్రొత్త భవనాలను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.

పాలమూరు ప్రజాగర్జన సభకు బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. భారీగా జనసమీకరణ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్య్రమాలను సభలో వివరించనున్నారు ప్రధాని మోదీ. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ స్పీచ్‌పై ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..