Narendra Modi: ప్రధాని మోదీ పేరుతో లాటరీ.. ఎంత సంపాందించాడో తెలిస్తే షాక్ అవుతారు..!

మన నిత్య జీవితంలో చాలా వింతైన సంఘటనలు చూసి ఉంటాం.. ఆశ్చర్యకరమైన సంఘటనలు వింటూ ఉంటాం.. అలాంటిది ఓ ఇంట్రెస్టింగ్ వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ లాటరీలో బహుమతి లభించింది. మోదీ ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేయలేదు. మరి ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా అక్కడే తిరకాసు ఉంది.

Narendra Modi: ప్రధాని మోదీ పేరుతో లాటరీ.. ఎంత సంపాందించాడో తెలిస్తే షాక్ అవుతారు..!
Loutery Won
Follow us
G Sampath Kumar

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 14, 2024 | 5:56 PM

మన నిత్య జీవితంలో చాలా వింతైన సంఘటనలు చూసి ఉంటాం.. ఆశ్చర్యకరమైన సంఘటనలు వింటూ ఉంటాం.. అలాంటిదే ఓ ఇంట్రెస్టింగ్ వార్త అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. దానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోదీకి లాటరీలో బహుమతి లభించింది. మోదీ ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేయలేదు. మరి ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా అక్కడే తిరకాసు ఉంది.

నరేంద్ర మోదీకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆయనను ప్రత్యేకంగా అభిమానించే వాళ్లు చాలా మందే ఉంటారు. ఓ అభిమాని నరేంద్రమోదీ పేరు మీద లాటరీ టిక్కెట్ తీశాడు. దీంతో ఆ వ్యక్తికి లాటరీలో బహుమతి లభించింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో శ్రీ శక్తి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపం వద్ద ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. లక్కీ డ్రాలో పాల్గొన్న స్థానిక భక్తుడు ప్రశాంత్ ప్రధాని నరేంద్రమోదీ పేరు మీద డ్రాలో చిట్టీ కొనుగోలు చేశాడు.

వీడియో:

సోమవారం నిర్వహించిన లక్కీ డ్రాలో అనూహ్యంగా నరేంద్రమోదీ పేరు మీద ఉన్న చిట్టి రెండవ బహుమతిగా ఎంపికైంది. ఈయన పేరు రాగానే భక్తులు ఎగిరి గంతేశారు. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నరేందర్ మోదీ పేరుపై బహుమతి గెలుచుకున్న భక్తుడు శ్రీ శక్తి యూత్ సభ్యులు మిక్సిని బహుమతిగా అందించారు. ఇప్పుడు.. ఆ బహుమతి గెలిచుకున్న వ్యక్తిని నరేంద్ర మోదీ అని పిలుస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి