PM-KISAN: రైతులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో పీఎం కిసాన్‌ డబ్బులు తీసుకునేందుకు పోస్టల్‌ శాఖ కీలక నిర్ణయం

PM-KISAN: ఇండియా పోస్టు, తెలంగాణ సర్కిల్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5794 పోస్టాఫీసుల ద్వారా పీఎం కిసాన్‌ సమ్మాన్ నిధి ఆర్థిక సహయాన్ని ఉపసంహరించుకునేందుకు..

PM-KISAN: రైతులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణలో పీఎం కిసాన్‌ డబ్బులు తీసుకునేందుకు పోస్టల్‌ శాఖ కీలక నిర్ణయం
Pm Kisan
Follow us

|

Updated on: Aug 11, 2021 | 9:17 PM

PM-KISAN: ఇండియా పోస్టు, తెలంగాణ సర్కిల్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5794 పోస్టాఫీసుల ద్వారా పీఎం కిసాన్‌ సమ్మాన్ నిధి ఆర్థిక సహయాన్ని ఉపసంహరించుకునేందుకు ఏర్పాట్లు చేసింది. రైతుకలు నగదు చెల్లింపులు చేయడానికి పోస్టల్ శాఖ మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేసింది. మంగళవారం కేంద్రం తొమ్మిదవ విడత పీఎం కిసాన్‌ సాహయాన్ని విడుదల చేసింది. అయితే సర్కిల్‌లోని పోస్టాఫీసులు మే 14 నుంచి మే 28 వరకు, ఈ ఏడాది పీఎం కిసాన్‌ డబ్బులు సుమారు 66,704 మంది రైతుల కోసం పోస్టల్‌ మైక్రో ఏటీఎంల ద్వారా రూ.28 కోట్ల మొత్తాన్ని పంపిణీ చేశాయి. ఈ మేరకు పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌, హైదరాబాద్ రీజియన్‌ కార్యాలయం నుంచి ఒక పత్రికా ప్రకటన విడుదలైంది.

గ్రామ పోస్టాఫీసుల నుంచి ఏ బ్యాంకుకు సంబంధించిన వారు అయినా ఆధార్‌ లింక్‌ ఉన్న ఖాతాలు ఉన్న రైతులు ఈ సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ కిసాన్‌ డబ్బులు తీసుకునేందుకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో పీఎం కిసాన్‌ (PM-KISAN) డబ్బులు ఉపసంహరించుకునేందుకు బ్యాంకు శాఖకు వెళ్లలేని రైతులకు పోస్టల్‌ మైక్రో ఏటీఎం సౌకర్యం చాలా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

పోస్టల్‌ మైక్రో ఏటీఎంను ఉపయోగించడానికి రైతులు తన ఆధార్‌ కార్డు, మొబైల్‌ నెంబర్‌తో సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఏదైనా బ్యాంకు అకౌంట్‌తో లింక్‌ చేయబడిన వేలిముద్ర ద్వారా, అలాగే బ్యాంకు ఖాతాకు లింక్‌ అయిన మొబైల్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా నగదు తీసుకోవచ్చన్నారు. అయితే ఈ మైక్రో ఏటీఎం ద్వారా రోజులో గరిష్టంగా రూ.10 వేలు విత్‌డ్రా చేయవచ్చన్నారు. పోస్టల్‌ మైక్రో ఏటీఎం ద్వారా ఎలాంటి రుసుము లేకుండా కిసాన్‌ సాయం అందుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి

Post Office: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10 వేల డిపాజిట్‌తో రూ.7 లక్షలు పొందవచ్చు

PMSBY Scheme: అదిరిపోయే స్కీమ్‌.. నెలకు రూ.1 డిపాజిట్‌ చేస్తే రూ.2 లక్షల వరకు పొందవచ్చు.. ఎలాగంటే..!

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. విత్‌డ్రా లిమిట్‌ పెంపు.. కొత్త నిబంధనలు