Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్.. నెక్ట్స్ టార్గెట్ పొలిటీషియన్స్..!

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలిపెట్టే సమస్య లేదన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. తమ తర్వాతి టార్గెట్ పొలిటీషియన్స్ అని చెప్పారు. బలమైన సాక్ష్యాలతో అనుమానితులను విచారిస్తామన్నారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. మరోకరి కోసం కూడా గాలిస్తున్నామని చెప్పారు.

Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్.. నెక్ట్స్ టార్గెట్ పొలిటీషియన్స్..!
Phone Tapping Case
Follow us

|

Updated on: Jul 31, 2024 | 6:00 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలిపెట్టే సమస్య లేదన్నారు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్. తమ తర్వాతి టార్గెట్ పొలిటీషియన్స్ అని చెప్పారు. బలమైన సాక్ష్యాలతో అనుమానితులను విచారిస్తామన్నారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. మరోకరి కోసం కూడా గాలిస్తున్నామని చెప్పారు.

తెలంగాణలో సంచలన రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ట్యాపింగ్ కేసులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు. రాజకీయ నేతలను సైతం విచారిస్తామని చెప్పారు. పొలిటిషియన్స్ వ్యవహారంపై సాక్ష్యాలు సేకరిస్తున్నామని, ఎవిడెన్స్ ఆధారంగా ప్రజా ప్రతినిధులను ప్రశ్నిస్తామని తెలిపారు. బలమైన సాక్ష్యాలతో అనుమానితులను విచారిస్తామని చెప్పారు డీసీపీ. ఈ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని, కోర్టు దానిని పరిగణలోకి తీసుకుందని తెలిపారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు తోపాటు మరోకరిని హైదరాబాద్ రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.

ఈ కేసులో ఇప్పటికే ఎస్ఐబీ మాజీ ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు జ్యూడిషియల్ రిమాండ్‌లో భాగంగా జైల్లో ఉన్నారు. కీలక నిందితులు ఇద్దరు విదేశాల్లో ఉన్నారని వాళ్లను ఇండియాకు రప్పించే ప్రయత్నం జరుగుతోందన్నారు డీసీపీ విజయ్‌ కుమార్. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన ప్రణీత్‌ రావు, రాధాకిషన్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న జుడీషియల్‌ రిమాండ్‌ను నాంపల్లి కోర్టు జూలై 31 వరకు పొడిగించింది. దర్యాప్తు అధికారులు చార్జిషీట్‌లో పొందుపర్చిన పత్రాల్లో కొన్నింటిని నిందితులకు ఇవ్వలేదని నిందితుల తరఫు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు. తదుపరి విచారణలోగా నివేదిక ఇవ్వాలంటూ విచారణను వాయిదా వేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..