Telangana: రోడ్డు పక్కన కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్లు.. ఎగబడి ఏరుకున్నారు.. కట్ చేస్తే
వేల్పూర్ మండలం అంక్సాపూర్ జాతీయ రహదారిపై కరెన్సీ నోట్లు కనిపించాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు ఎగబడి మరీ ఆ నోట్లను ఏరుకున్నారు. ఆ తర్వాత సీన్ రివర్సయింది. డీటేల్స్ తెలుసుకుందాం పదండి...
చాలా మందికి రకరకాల ఆశలు ఉంటాయి. అలా రోడ్డుపై నడుచుకుంటే వెళ్తుంటే.. పైసలతో నిండిన బ్యాగు దొరికితే బాగుండు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ ఆశ ఆశగా మిలిగిపోతుంది తప్ప.. రూపాయి బిళ్ల కూడా దొరికవు కొందరికీ. ఇక్కడ అలాంటి సీన్ నిజమైందండోయ్. రోడ్డుపై పోతుండగా ఐదువందల నోట్లు కుప్పలు తెప్పలుగా కనిపించినయ్.. ఇక ఊకుంటారా చెప్పండి..బండ్లు ఆపి మరీ దొరికినోళ్లు దొరికనట్లు మస్త్ ఏరుకున్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి…
దేవుడు చాలా చెడ్డోడు జానకీ.. ఐదు వందల నోట్లు రోడ్ల మీద కుప్పలు తెప్పలుగా కనిపించినయ్ అని సంబరపడి తెచ్చుకున్నంతసేపు పట్టలేదు ఆ ఆనందం ఆవిర్వడానికి. ఎందకంటే.. అవి నకిలీ నోట్లు అని.. నిశితంగా చూస్తే అర్థమైంది. నిజామాబాద్ జిల్లా వేల్పుర్ మండలం అక్సాంపూర్ ఊరి శివారులో రొడ్డు పక్కన వంద రూపాల నోట్లు..ఐదు వందల నోట్లు చెట్ల కింద ఆకులు రాలి పడ్డట్టే కింద కనిపించినయ్. అటు వైపు వెళ్లే జనాలు పరుగులు తీస్తూ మరీ ఎగబడి ఎరుకున్నారు ఆ నోట్లని. మన పంట పండిందిరా అనుకుని ఆ నోట్లన్నీ జేబుల్లోకి నింపుకున్నారు.. తీరా నోట్లన్ని ఏరుకోని వాటిని తీక్షణంగా చూస్తే తెలిసింది అవి ఉత్త దొంగనోట్లని. దీంతో వాళ్ల ఆశలన్నీ ఆవిరయ్యాయి.
జనాల ఆశల గురించి చెప్పేది ఏముంది కానీ.. అన్ని నకిలీ నోట్లు అక్కడ ఎవ్వరు తెచ్చి పడేశారు అనేదే పెద్ద డౌట్.. అంటే ఆ ఏరియాల ఏమన్న నకిలీ నోట్ల దందా నడుస్తుందా ..? లేదా పిల్లలు ఎవరన్నా ఆడుకుని ఆ నోట్లను అక్కడ పడేశారా…? ఆయా కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారట పోలీసులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..