Telangana: వామ్మో ఇన్ని గబ్బిలాలా.. ఓరుగల్లు ప్రజలను వణికిస్తున్న గబ్బిలాలు.. ఆ మూడు చెట్ల పైనే ఆవాసం

వరంగల్ మహానగరంలో జనాభా పెరుగుదల ఎంతగా ఉందో అదే స్థాయిలో కోతులు కుక్కల ఎదుగుదల ఉంది. సగటున కనీసం రోజుకు ఐదుగురు కుక్కకాటుకు గురవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే కోతుల కుక్కలతో బెంబేలెత్తిపోతున్న ఓరుగల్లు ప్రజలను ఇప్పుడు గబ్బిలాలు గజగజ వణికిస్తున్నాయి. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో కేవలం ఓ మూడు చెట్లనే ఆవాసంగా ఏర్పాటు చేసుకొని వేల సంఖ్యలో గబ్బిలాలు ఇక్కడ సేద తీరుతున్నాయి.

Telangana: వామ్మో ఇన్ని గబ్బిలాలా.. ఓరుగల్లు ప్రజలను వణికిస్తున్న గబ్బిలాలు.. ఆ మూడు చెట్ల పైనే ఆవాసం
Bats Hulchul
Follow us

| Edited By: Surya Kala

Updated on: Aug 02, 2024 | 11:57 AM

ఇప్పటికే కోతులు, కుక్కలతో బేజారై పోతున్న ఆ మహానగర ప్రజలకు ఇప్పుడు మరో పెద్ద సమస్య వచ్చి పడింది.. కీడు సంకేతంగా భావించే గబ్బిలాలు అక్కడి ప్రజలను వణికిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో గబ్బిలాలు ఆ చెట్లపై ఆవాసం ఏర్పాటు చేసుకొని దడ పుట్టిస్తున్నాయి. ఇంతకీ గబ్బిలాల గండంతో వణికిపోతున్న ఆ మహానగరం ఏది? చీకటి గుహలలో నివశించే గబ్బిలాల ఆ చెట్ల పైనే ఎందుకు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి..? వాటి నుండి విముక్తి ఎలా..అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం..

అవును కోతులు కుక్కలు ప్రజలకు ప్రశాంత లేకుండా చేస్తున్నాయి. పాలకులను ప్రజలను పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య ఇది. ముఖ్యంగా వరంగల్ మహానగరంలో జనాభా పెరుగుదల ఎంతగా ఉందో అదే స్థాయిలో కోతులు కుక్కల ఎదుగుదల ఉంది. సగటున కనీసం రోజుకు ఐదుగురు కుక్కకాటుకు గురవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే కోతుల కుక్కలతో బెంబేలెత్తిపోతున్న ఓరుగల్లు ప్రజలను ఇప్పుడు గబ్బిలాలు గజగజ వణికిస్తున్నాయి. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో కేవలం ఓ మూడు చెట్లనే ఆవాసంగా ఏర్పాటు చేసుకొని వేల సంఖ్యలో గబ్బిలాలు ఇక్కడ సేద తీరుతున్నాయి.

ఈ చెట్ల పైనే ఆవాసం ఏర్పాటు చేసుకొని వేల సంఖ్యలో వాటి సంతతి పెంచుకుంటున్నాయి. సహజంగా గబ్బిలాలు ఇంట్లోకొస్తే కీడు సంకేతంగా భావిస్తారు. కొందరైతే సెంటిమెంట్ గా ఆ ఇండ్లను వదిలేసి వెళ్తారు. వాటినుండి వెలువడే విసర్జిత వ్యర్ధాల వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయని వైద్యులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ మద్య వ్యాప్తి చెందిన నిఫా వైరస్ లాంటి ప్రాంతక వైరస్ ల వ్యాప్తి కి కూడా గబ్బిలాలే కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి విసర్జిత వ్యర్థాల ద్వారా ఇంకా వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో ఇన్ని వేల సంఖ్యలో గబ్బిలాలు సంచరిస్తుండడంతో ఇక్కడికి ఆహ్లాదం కోసం వచ్చే సందర్శకులు గబ్బిలాలను చూసి గజగజవణికి పోతున్నారు. ఈ చెట్ల కిందకు వెళితే గబ్బిలాల వ్యర్థాలతో ఎలాంటి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయో అని ఆందోళన చేస్తున్నారు. పక్కనే నగర ప్రజల దాహార్తిని తీర్చే వాటర్ ట్యాంక్ ఉంది. మరోవైపు గబ్బిలాల విసర్జిత వ్యర్థాలతో నీళ్లు కలుషితం అవుతాయని ఆందోళన వ్యక్తం అవుతుంది.

పబ్లిక్ గార్డెన్ తో పాటు పక్కనే బిఈడి కళాశాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓ రావి చెట్టుపై కూడా వందల సంఖ్యలో గబ్బిలాలు ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి. పగలంతా ఎక్కడెక్కడో సంచరించే గబ్బిలాలు సాయంత్రం కాగానే మళ్లీ ఈ చెట్లపైకి చేరి ఇక్కడే ఆవాసం ఉంటున్నాయి. పక్కనే ఉన్న పాత భవనాల్లోకి చేరి ఆ భవనాలను కూడా గబ్బిలాలకు ఆవాసంగా మార్చుకున్నాయి. ఈ భవనాలను సందర్శిస్తే వేల సంఖ్యలో గబ్బిలాలు వాటి సంతతి దర్శనమిచ్చాయి.

అయితే క్షీరధాలలో ఎగిరే జీవిగా కేవలం గబ్బిలాలకు మాత్రమే ప్రత్యేకత ఉంటుంది. వీటి విసర్జిత వ్యర్థాల వల్ల అనేక వ్యాధులు సంక్రమిస్తాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గబ్బిలాల విసర్జిత వ్యర్థాలతో ఎంత నష్టం ఉందో అయితే గబ్బిలాల వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని జంతు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఎక్కవగా చీకటి ప్రదేశాలు.. గుహలలో నివసించే గబ్బిలాలు ఇలాంటి జనావాసాల మధ్య ఉన్న చెట్లను ఎందుకు ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నాయి? పబ్లిక్ గార్డెన్ పరిసరాల్లో ఉన్న ఆ మూడు చెట్లనే ఎందుకు ఆవాసంగా ఏర్పాటు చేసుకున్నాయి? వాటి నుండి విముక్తి ఎలా? అనేది అంతు చిక్కడం లేదు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఓరుగల్లు ప్రజలను వణికిస్తున్న గబ్బిలాలు 3చెట్లపై వేల సంఖ్యలోఆవాసం
ఓరుగల్లు ప్రజలను వణికిస్తున్న గబ్బిలాలు 3చెట్లపై వేల సంఖ్యలోఆవాసం
టీమిండియా ప్లేయింగ్ 11లో ఏడుగురికి డైరెక్ట్ ఎంట్రీ.. పంత్‌ ఔట్
టీమిండియా ప్లేయింగ్ 11లో ఏడుగురికి డైరెక్ట్ ఎంట్రీ.. పంత్‌ ఔట్
ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టిన కారు, విద్యార్థి దుర్మరణం
ఫ్లైఓవర్ గోడను ఢీకొట్టిన కారు, విద్యార్థి దుర్మరణం
అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా? ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్‌!
అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా? ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్‌!
దేవుడి నైవేద్యం కూడా అప్ గ్రేడ్ .. అరటి పండు ప్లేస్ లో అవకాడోలు
దేవుడి నైవేద్యం కూడా అప్ గ్రేడ్ .. అరటి పండు ప్లేస్ లో అవకాడోలు
భారీగా తగ్గిన కల్కి మూవీ టికెట్ ధరలు..
భారీగా తగ్గిన కల్కి మూవీ టికెట్ ధరలు..
సముద్ర తీరంలో తునీగల బృందం హల్ చల్,... నీలి మేఘంగా మారి సందడి..
సముద్ర తీరంలో తునీగల బృందం హల్ చల్,... నీలి మేఘంగా మారి సందడి..
భారతీయులు చట్టబద్ధంగా ఇంట్లో ఎంత మద్యం ఉంచుకోవచ్చో తెలుసా?
భారతీయులు చట్టబద్ధంగా ఇంట్లో ఎంత మద్యం ఉంచుకోవచ్చో తెలుసా?
ఆ విషయంలో మెగాస్టార్ కంటే దళపతే బెస్ట్.. కీర్తిసురేష్ కామెంట్స్..
ఆ విషయంలో మెగాస్టార్ కంటే దళపతే బెస్ట్.. కీర్తిసురేష్ కామెంట్స్..
IND vs SL 1st ODI: 2,524 రోజుల నిరీక్షణకు తెర..
IND vs SL 1st ODI: 2,524 రోజుల నిరీక్షణకు తెర..