Viral Video: దేవుడి నైవేద్యం కూడా అప్ గ్రేడ్ అయింది.. అరటి పండు ప్లేస్ లో అవకాడోలు

ధర్మేష్ బా తన కుటుంబం అరటిపండ్ల స్థానంలో దేవతలకు అవకాడోలను సమర్పించినట్లు పంచుకున్నారు. పూజ సమయంలో నైవేద్యం సమర్పించే ఈ అసాధారణ ఎంపిక చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు రెండు గా విడిపోయేలా చేసింది. కొందరు పోస్ట్‌ను ఉల్లాసంగా భావించగా, మరికొందరు మతపరమైన ఆచారాల కోసం ఇలాంటి పండును ఉపయోగించడం సముచితమా అంటూ ప్రశ్నించారు.

Viral Video: దేవుడి నైవేద్యం కూడా అప్ గ్రేడ్ అయింది.. అరటి పండు ప్లేస్ లో అవకాడోలు
Viral News
Follow us

|

Updated on: Aug 02, 2024 | 11:37 AM

హిందూ మతంలో పూజకు ఎంత విశిష్ట స్థానం ఉందొ.. అదే విధంగా పూజ సమయంలో ఉపయోగించే సామాగ్రి విషయంలో కూడా ఉంది. దేవుడి పూజకు ఉపయోగించే పువ్వులు పండ్ల విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి. రోజూ పూజ చేసే వారు అయితే నైవేద్యంగా డ్రై ఫ్రూట్స్, అరటిపండ్లు, కొబ్బరి కాయను సమర్పిస్తే.. కొన్ని ప్రత్యెక సందర్భాల్లో యాపిల్ బత్తాయి వంటి పండ్లను సమర్పిస్తారు. అయితే ఇప్పుడు ఒక ఫ్యామిలీ దేవుడి పూజ అనంతరం నైవేద్యంగా అరటి పండు ప్లేస్ లో అవకాడోలను సమర్పిస్తున్నారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ సోషల్ మీడియా Xలో ఒక పోస్ట్ చేశారు.

సోషల్ మీడియా వినియోగదారుడు ధర్మేష్ బా తన కుటుంబం అరటిపండ్ల స్థానంలో దేవతలకు అవకాడోలను సమర్పించినట్లు పంచుకున్నారు. పూజ సమయంలో నైవేద్యం సమర్పించే ఈ అసాధారణ ఎంపిక చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు రెండు గా విడిపోయేలా చేసింది. కొందరు పోస్ట్‌ను ఉల్లాసంగా భావించగా, మరికొందరు మతపరమైన ఆచారాల కోసం ఇలాంటి పండును ఉపయోగించడం సముచితమా అంటూ ప్రశ్నించారు. అయినప్పటికీ బా తల్లిదండ్రులు సానుకూల దృక్పధంతో ఉన్నారు. తన తల్లిదండ్రులు పట్టణంలో ఉన్నారు. దీంతో దేవునికి నైవేద్యంగా సమర్పించే అర్పణలు అరటిపండ్ల నుంచి అవకాడోలకు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి” అని బా చెప్పాడు. అంతేకాదు ఇందుకు సంబంధించిన పండ్ల చిత్రాన్ని మైక్రో-బ్లాగింగ్‌లో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

కొన్ని రోజుల క్రితం పోస్ట్‌ చేసిన ఈ వీడియో ఇప్పటి వరకూ వేల సంఖ్యలో వ్యూస్, అనేక లైక్‌లను సొంతం చేసుకుంది. అంతేకాదు రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఒకరు “అవి ఏమిటి, మిలీనియల్స్?” కామెంట్ చేయగా ఈ కామెంట్ కు ఒరిజినల్ పోస్టర్‌లో, “మేము మిలీనియల్స్” అని రిప్లై వచ్చింది. దేవుడా lol, అభిరుచులు పరిణామం చెందుతాయి. కనుక దేవుడికి సమర్పించే విషయంలో కూడా రకరకాల పదార్ధాలు చేరుకుంటాయి. ఇంకొకరు “ఇకపై మధ్యతరగతి కాదు, అవకాడో క్లాస్” అని వ్యాఖ్యానించగా .. మరొకరు హిందూ పూజలో అరటి పండు సమర్పించడానికి ఒక రీజన్ ఉందని.. కనుక ఇలాంటి పనులు మాని.. అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించండి అంటూ కామెంట్ చేశారు. అయితే ఒకరు అవకడో మీద అగర్బత్తీలను గుచ్చడం ఎలా ,.. అయినా కొన్ని రోజులైనా అరటి పండ్లకు విశ్రాంతి లభిస్తుంది అని ఒక వినియోగదారు కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..