Ismart News: తప్పిపోయిన కుక్క.. 250 కిలోమీటర్లు ప్రయాణించి.. చివరికి ..!

Ismart News: తప్పిపోయిన కుక్క.. 250 కిలోమీటర్లు ప్రయాణించి.. చివరికి ..!

Phani CH

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 02, 2024 | 12:45 PM

ఏటన్న జాత్రలకు పోయినప్పుడు చిన్నపిల్లలే గాని పెద్దోల్లే గాని తప్పిపోతుంటరు ఓగొసారి.. ఇగ మైక్ అనౌన్సు మెంటు కాడికి పోయి పలానైన తప్పిపోయిండు.. మీకోసం గుడితాన పోలీసోల్ల తాన ఎద్రుసూస్తుర్రు అని చెప్తుంటరు. అదే ఏటన్న వూర్కిపోయినప్పుడు జాడ దొర్కక పోతే ఎట్లనో గట్ల మందిని అడుక్కుంట జాడ దొర్కవట్టుకుంట పోతుంటం.. ఇప్పుడైతే గూగుల్ మ్యాప్సు న్నయి.. లోకేషన్ పెట్టుకోని పోతున్నం..మరీ జీవాలకు యే లోకేషన్ మ్యాపులుంటయి..

ఏటన్న జాత్రలకు పోయినప్పుడు చిన్నపిల్లలే గాని పెద్దోల్లే గాని తప్పిపోతుంటరు ఓగొసారి.. ఇగ మైక్ అనౌన్సు మెంటు కాడికి పోయి పలానైన తప్పిపోయిండు.. మీకోసం గుడితాన పోలీసోల్ల తాన ఎద్రుసూస్తుర్రు అని చెప్తుంటరు. అదే ఏటన్న వూర్కిపోయినప్పుడు జాడ దొర్కక పోతే ఎట్లనో గట్ల మందిని అడుక్కుంట జాడ దొర్కవట్టుకుంట పోతుంటం.. ఇప్పుడైతే గూగుల్ మ్యాప్సు న్నయి.. లోకేషన్ పెట్టుకోని పోతున్నం..మరీ జీవాలకు యే లోకేషన్ మ్యాపులుంటయి.. పలానా కాడికి ఎట్ల పోవాలే అని ఎవ్వల్ని అడ్గుతయి..? అవ్వేం లేకుంటనే జాత్రల తప్పిపోయిన ఓ కుక్క 250 కిలోమీటర్లు నడ్సుకుంట ఇల్లు చేరిందంటే నమ్ముతరా.? కర్నాటక బెలగావి జిల్లా యమ గర్ని కాడ ఇచ్చంత్రాల ముచ్చటైంది.. కుంబర్ అనే టాయ్న సాదుకునే కుక్క మారాస్టల తప్పిపోతే 250 కిలోమీటర్లు ఆడ్కెంచి నడ్సుకుంట కర్నాటకకొచ్చిందంటే ఎంత తెల్వికల్ల కుక్కనో సూడుర్రి.. కుంబర్ అనేటాయ్న మారాజ అని పేరువెట్టి ఈ నల్లకుక్కను అల్లారు ముద్దుగ సాదుకుంటుండట.. ఆయ్నకేమో జెర భక్తి ఎక్వ. పాదయాత్రలు చేస్కుంట గుల్లు తిర్గుతుండట.. అట్ల పాదయాత్రల మారాజ కుక్కను కూడ ఎంట దీస్కోని పోయిండట.. మొన్న జూలైల మారాస్ట మహబలేశ్వర్ దగ్గరున్న జ్యోతిబా , విఠోబా గుల్లకు పాదయాత్ర చేస్కుంట ఈ కుక్కను దీస్కోని పోయిండట.. అట్ల విఠోబా గుడి కాడికి పోయినప్పుడు జూలై పద్నాల్గు తారీక్నాడు మందిల ఈ కుక్క తప్పిపోయిందట..

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

84 ఏళ్లపాటు ఒకే కంపెనీలో ఉద్యోగం.. గిన్నీస్‌ రికార్డ్‌ ఎలా సాధ్యమైందంటే !!

ఇనుప గొలుసుతో చెట్టుకు కట్టేస్తే.. పోలీసులొచ్చి కాపాడారు

టూ వీలర్‌ నడుపుతూ వెనుకున్న వ్యక్తితో మాట్లాడటం నేరం

వందేభారత్‌ సిబ్బంది చెంప ఛెళ్లుమనిపించిన ప్రయాణికుడు

మెగా ఇంట పెళ్లి సందడి ?? సాయి దుర్గా తేజ్‌ రియాక్షన్ ఇదే

Published on: Aug 02, 2024 12:44 PM