Kerala: కేరళలో జలప్రళయం.. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.!
కేరళ లోని వయనాడులో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 90కి పైగా చేరింది. సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు స్థానిక మసీదులో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్.. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటిదాకా 250 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఈ పరిస్థితుల్లో కేరళకు రెండు ఆర్మీ కాలమ్స్‌ని కేంద్రం పంపించింది.
కేరళ లోని వయనాడులో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 90కి పైగా చేరింది. సహాయక చర్యలను వేగవంతం చేశారు అధికారులు స్థానిక మసీదులో తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్.. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటిదాకా 250 మందిని సహాయక బృందాలు రక్షించాయి. ఈ పరిస్థితుల్లో కేరళకు రెండు ఆర్మీ కాలమ్స్‌ని కేంద్రం పంపించింది. అదేవిధంగా కేంద్రమంత్రి జార్జి కురియన్‌ని కేరళకు పంపించారు ప్రధాని మోదీ. మృతుల కుటుంబాలకు రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మరోవైపు మిగ్ 17, ధృవ్ హెలికాప్టర్లను ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దించింది. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటు ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీయడం పెద్దసవాల్‌గా మారింది. వయనాడుతో పాటు కేరళ లోని కోలికోడ్ , త్రిసూర్ , పాలక్కాడ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వంతెనలు కుప్పకూలాయి..ఇళ్లు ధ్వంసమయ్యాయి. చర్చిలతో పాటు ప్రార్థనా స్థలాల్లోకి కూడా వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా రెండు రోజుల పాటు ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేశారు. 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కాసరగోడ్, కన్నూర్, కోజికోడ్, వయనాడ్, మలపురం, పాలక్కాడ్, త్రిస్సూర్, ఇడుక్కి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అతి భారీ వర్షాలతో వరదలు ముంచెత్తే అవకాశం ఉండడంతో ఈ ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.