Nita Ambani: పారిస్‌లో ఇండియా హౌస్‌ను చూపించిన నీతా అంబానీ
పారిస్ ఒలింపిక్స్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ విశ్వక్రీడల్లో భారత్ కాంస్యంతో పతకంతో ఖాతా తెరిచింది. మరిన్ని మెడల్స్ సాధించేందుకు అథ్లెట్లు సన్నద్ధమవుతున్నారు. వీరందరి కోసం ఈ ఒలింపిక్స్ గ్రామంలో ప్రత్యేకంగా ‘ఇండియా హౌస్ ను ఏర్పాటుచేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఇటీవల దీన్ని ప్రారంభించారు. తాజాగా ఆ హౌస్ విశేషాలను ఆమె పంచుకున్నారు.
పారిస్ ఒలింపిక్స్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ విశ్వక్రీడల్లో భారత్ కాంస్యంతో పతకంతో ఖాతా తెరిచింది. మరిన్ని మెడల్స్ సాధించేందుకు అథ్లెట్లు సన్నద్ధమవుతున్నారు. వీరందరి కోసం ఈ ఒలింపిక్స్ గ్రామంలో ప్రత్యేకంగా ‘ఇండియా హౌస్ ను ఏర్పాటుచేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ సభ్యురాలు, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఇటీవల దీన్ని ప్రారంభించారు. తాజాగా ఆ హౌస్ విశేషాలను ఆమె పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఒలింపిక్స్ క్రీడల్లో పోటీపడుతున్న మన అథ్లెట్ల కోసం తొలిసారిగా ఒలింపిక్స్ గ్రామంలో ఓ సొంత ఇల్లు ఉంది. మా అథ్లెట్లను సత్కరించడానికి, వారి విజయాలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇది ఓ వేదిక. మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా దీన్ని ఏర్పాటుచేశాం. ఇక్కడ కశ్మీర్, బనారస్ నుంచి తీసుకొచ్చిన కళాకృతులు, హస్త కళలు, భారత సంప్రదాయ ఆభరణాలను ప్రదర్శిస్తున్నాం అంటూ వీడియోలో నీతా అంబానీ వివరించారు. ఇండియా హౌస్ ప్రారంభ వేడుకలను వీడియోలో చూపించారు. కళాకారుల నృత్యాలకు నీతా కూడా కాలు కదిపి డ్యాన్స్ చేశారు. వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, కుమార్తె ఈశా కూడా కన్పించారు. ఈ వేడుకకు వచ్చిన అతిథులకు భారతీయ వంటకాలను రుచి చూపించారు. పారిస్ ఒలింపిక్స్ ప్రారంభమైన మర్నాడు జులై 27న లా విల్లెట్ ప్రాంతంలో ఈ ఇండియా హౌస్‌ను ప్రారంభించారు. ఈ వేడుకలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. ఆగస్టు 11 వరకు ఈ హౌస్‌ను సందర్శకులు వీక్షించొచ్చు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొండపై బయటపడిన అద్భుతం.. 14,16వ శతాబ్ధాలకు చెందినదిగా గుర్తింపు
Sonu Sood: సోనూ సూద్ ఆస్తులు ఎంతో తెలుసా ??
పెళ్లి కాలేదు కానీ 100 మందికి పైగా పిల్లలు.. 12 దేశాల్లో వంద మందికి పైగా !!
హీరోయిన్‌తో సరసం ఆడమంటే.. సిగ్గుతో లగెత్తాడట !! ఏంటి మహేషా ఇది !!
హీరో కాలనీలో డ్రైనేజీ లీక్ !! రాజశేఖర్ సంచలన ట్వీట్