Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొండపై బయటపడిన అద్భుతం.. 14,16వ శతాబ్ధాలకు చెందినదిగా గుర్తింపు

కొండపై బయటపడిన అద్భుతం.. 14,16వ శతాబ్ధాలకు చెందినదిగా గుర్తింపు

Phani CH
|

Updated on: Aug 02, 2024 | 9:47 AM

Share

చారిత్రక నేపధ్యం ఉన్న గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో.. ఇటీవలకాలంలో అనేక చారిత్రిక ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కొండపై చెక్కిన పురాతన శాసనాన్ని ఔత్సాహిక పరిశోధకులు కనుగొన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంపై కారుణ్య ఆశ్రమ నిర్వాహకుడు అల్లం ఇన్నారెడ్డి పుస్తకాన్ని రచించారు. ఇందులో అనేక చారిత్రక అంశాలను ప్రస్తావించారు.

చారిత్రక నేపధ్యం ఉన్న గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో.. ఇటీవలకాలంలో అనేక చారిత్రిక ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా కొండపై చెక్కిన పురాతన శాసనాన్ని ఔత్సాహిక పరిశోధకులు కనుగొన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంపై కారుణ్య ఆశ్రమ నిర్వాహకుడు అల్లం ఇన్నారెడ్డి పుస్తకాన్ని రచించారు. ఇందులో అనేక చారిత్రక అంశాలను ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఔత్సాహిక పరిశోధకులైన శ్రీనాధ్ రెడ్డి, శివశంకర్ గ్రామం చుట్టుపక్కల ఉన్న చరిత్ర ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా పాటిబండ్ల కొండపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయం ప్రవేశ ద్వారం పక్కనే ఒక శాసనాన్ని గుర్తించారు. ఆ శాసనాన్ని పరిశోధించగా క్రీ.శ.17-18 శతాబ్ధం నాటి శాసనంగా గుర్తించారు. ఈ శాసనంలో గోపాపాత్రుడి కొడుకు కొండముడు అనే వ్యక్తి గుర్రాన్ని కొండ పడమటి దిక్కు వైపు నుండి ఎక్కించి తూర్పు దిశగా దిగేవారని ఉన్నట్లు వారు తెలిపారు. ఈ శాసనంతో పాటు క్రీస్తు పూర్వం 2000 ఏళ్ల నాటి రాతి పనిముట్లు, 14,16వ శతాబ్దాలకు చెందిన మహిషాసుర మర్దని, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు. అవన్నీ కూడా చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లేనని వీటిని భద్రపర్చాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sonu Sood: సోనూ సూద్ ఆస్తులు ఎంతో తెలుసా ??

పెళ్లి కాలేదు కానీ 100 మందికి పైగా పిల్లలు.. 12 దేశాల్లో వంద మందికి పైగా !!

హీరోయిన్‌తో సరసం ఆడమంటే.. సిగ్గుతో లగెత్తాడట !! ఏంటి మహేషా ఇది !!

హీరో కాలనీలో డ్రైనేజీ లీక్‌ !! రాజశేఖర్ సంచలన ట్వీట్

పవన్‌తో సెల్ఫీ కోసం.. మెగా డాటర్‌ను బతిలాడిన హీరోయిన్