AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friendship Day: ఫ్రెండ్‌షిప్ డే న స్నేహితులతో సరదాగా గడపాలని అనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలు బెస్ట్ ఎంపిక

ఫ్రెండ్‌షిప్ డే ప్రతి ఏడాది ఆగస్టు మొదటి ఆదివారాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీ ఫ్రెండ్ షిప్ డే.. అంటే స్నేహితుల దినోత్సవం  ఆదివారం అంటే వారాంతంలో వస్తుంది. అటువంటి పరిస్థితిలో స్నేహితులతో కలిసి 2 నుంచి 3 రోజుల పాటు సరదాగా గడిపేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైనా డిఫరెంట్ గా అందమైన ప్రదేశాలను సందర్శించాలంటే దేశరాజధాని ఢిల్లీకి సమీపంలో చాలా అందమైన ప్రదేశాలును ఎంపిక చేసుకోవచ్చు.

Friendship Day: ఫ్రెండ్‌షిప్ డే న స్నేహితులతో సరదాగా గడపాలని అనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలు బెస్ట్ ఎంపిక
Friendship Day 2024
Surya Kala
|

Updated on: Aug 02, 2024 | 9:24 AM

Share

స్నేహితులతో ప్రయాణం ఒక విభిన్నమైన వినోదం. కాలేజీ టైమ్‌లో చాలా మంది స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి బయటకు వెళ్తుంటారు. అయితే కాల క్రమంలో ప్రతి ఒక్కరూ తమ జీవితంలో బిజీగా మారతాయి. అప్పుడు తమ స్నేహితులను కలిసే సమయం కూడా దొరకదు. స్నేహితులు చాలాసార్లు కలవాలని ప్లాన్‌లు వేసుకుంటారు. అయితే మునుపటిలా అందరూ కలిసి మెలిసి సందడి చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఫ్రెండ్‌షిప్ డే రోజున మీ స్నేహితులతో కలిసి ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లవచ్చు.

ఫ్రెండ్‌షిప్ డే ప్రతి ఏడాది ఆగస్టు మొదటి ఆదివారాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీ ఫ్రెండ్ షిప్ డే.. అంటే స్నేహితుల దినోత్సవం  ఆదివారం అంటే వారాంతంలో వస్తుంది. అటువంటి పరిస్థితిలో స్నేహితులతో కలిసి 2 నుంచి 3 రోజుల పాటు సరదాగా గడిపేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఎవరైనా డిఫరెంట్ గా అందమైన ప్రదేశాలను సందర్శించాలంటే దేశరాజధాని ఢిల్లీకి సమీపంలో చాలా అందమైన ప్రదేశాలును ఎంపిక చేసుకోవచ్చు. ఇక్కడ మీరు మీ స్నేహితులతో కలిసి సరదాగా సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

నీమ్రానా కోట: నీమ్రానా కోట ఢిల్లీ నుంచి 112 కిలోమీటర్ల దూరంలో ఆరావళి పర్వతాల సమీపంలో ఉంది. ఢిల్లీ చుట్టూ ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఇది ఒకటి. ఇదొక విలాసవంతమైన హెరిటేజ్ హోటల్. ఇక్కడ మీరు మీ కుటుంబం లేదా స్నేహితులతో సరదాగా గడపవచ్చు. వాస్తవానికి ఇది ఒక కోట.. తర్వాత ఇది ఒక విలాసవంతమైన హెరిటేజ్ హోటల్‌గా మార్చబడింది. స్విమ్మింగ్ పూల్‌తో పాటు స్పా, హ్యాంగింగ్ గార్డెన్, జిప్ లైన్ కూడా ఇక్కడ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మానేసర్: గర్హ్‌గావ్ జిల్లాలో ఉన్న మనేసర్ ఒకటి నుండి రెండు రోజుల పర్యటనకు అనువైనది. ఇక్కడ దామ్‌దామా సరస్సు సందర్శనం.. బోటింగ్ చేయడం అందమైన అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడ చుట్టూ పచ్చదనం, సరస్సు సుందర దృశ్యం చాలా మనోహరంగా ఉంటుంది. ఇక్కడ మనేసర్ గోల్ఫ్ కోర్స్, పండాల హిల్స్, చిరుతపులి ట్రేస్, సుల్తాన్‌పూర్ నేషనల్ పార్క్‌లను సందర్శించవచ్చు.

జైపూర్: జైపూర్ కూడా వెళ్ళవచ్చు. ఇది ఢిల్లీ నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి 5 నుండి 6 గంటలు పట్టవచ్చు. ఇక్కడ చూడవలసిన అనేక ప్రదేశాలున్నాయి. అమెర్ ఫోర్ట్, హవా మహల్, జంతర్ మంతర్, గల్తాజీ టెంపుల్, బిర్లా టెంపుల్, నహర్‌ఘర్ ఫోర్ట్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం, జల్ మహల్, జైఘర్ ఫోర్ట్, సిటీ ప్యాలెస్, రాంబాగ్ ప్యాలెస్, పన్నా మీనా కా కుండ్, గాటర్, సిసోడియా రాణి ప్యాలెస్, గార్డెన్స్ సందర్శించవచ్చు. జైపూర్‌లో ఒంటె మీద స్వారీ చేసి ఆనందించ వచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..