Hyderabad: ఇదో కొత్తరకం దోపిడీ.. అద్దె కారుతో పరారైన ప్రయాణికుడు, క్యాబ్ డ్రైవర్ లబోదిబో..
హైదరాబాద్ సిటీలో రోజురోజుకూ మెసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కార్లను, బైక్స్ ను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. ఖరీదైన కార్లను దొంగిలిస్తూ డ్రైవర్లకు, ఓనర్లకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తాను అద్దెకు తీసుకున్న కారుతో పరారయ్యాడు.

హైదరాబాద్ సిటీలో రోజురోజుకూ మెసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కార్లను, బైక్స్ ను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు. ఖరీదైన కార్లను దొంగిలిస్తూ డ్రైవర్లకు, ఓనర్లకు షాక్ ఇస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి తాను అద్దెకు తీసుకున్న కారుతో పరారయ్యాడు. ట్యాక్సీ అగ్రిగేటర్ యాప్ ద్వారా నిందితుడు శేరిలింగంపల్లి నుంచి పల్లారుగూడకు వెళ్లేందుకు సెడాన్ కారును బుక్ చేసుకున్నాడు. ఆ తర్వాత డ్రైవర్ ను ఓ ప్రముఖ రెస్టారెంట్ వద్ద ఆపాలని కోరాడు. దీంతో డ్రైవర్, సదరు ప్రయాణికుడు ఇద్దరూ ఒకేసారి కిందకు దిగారు. ఆ తర్వాత నిందితుడు డ్రైవర్ కు ఫోన్ చేయాలని చెప్పి రెస్టారెంట్ నుంచి బయటకు వెళ్లాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. కారు తాళాలు.. దానికే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో డ్రైవర్ బయటకు వచ్చి చూడగా ఆ వ్యక్తి తో పాటు కారు కూడా కనిపించలేదు.
డ్రైవర్ భోజనం చేస్తుండగా నిందితుడు ఫోన్ లో ఉన్నట్లు నటించాడు. నెట్ వర్క్ లో సమస్యలు ఉన్నాయని డ్రైవర్ ను ఫోన్ అడిగాడని, ఆ తర్వాత కారుతో వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. మణికొండకు చెందిన డ్రైవర్ కోట్ల మోషి ఈ ఘటనపై ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు సీరియల్ నేరస్తుడని, గతంలోనూ ఇలాంటి కేసుల్లో ప్రమేయం ఉందని పోలీసులు తెలిపారు. ఐపీసీ సెక్షన్ 379 (దొంగతనానికి శిక్ష) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని గుర్తించేందుకు ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారని ఓ అధికారి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



