AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Miyapur Cheddi Gang Robbery: మియాపూర్‌ చెడ్డీగ్యాంగ్‌ చోరీపై కీలక అప్‌డేట్.. ముమ్మర గాలింపు చేపట్టిన ఖాకీలు

హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్‌ శనివారం (మార్చి 16) రాత్రి చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. బ్లాక్‌ చెడ్డీలు ధరించి మారణాయుధాలతో స్కూల్‌లో ప్రవేశించిన అగంతకులు పాఠశాల కార్యాలయంలోని కౌంటర్‌లో ఉన్న రూ.7.85 లక్షల నగదును దోచుకెళ్లారు. చోరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు..

Miyapur Cheddi Gang Robbery: మియాపూర్‌ చెడ్డీగ్యాంగ్‌ చోరీపై కీలక అప్‌డేట్.. ముమ్మర గాలింపు చేపట్టిన ఖాకీలు
Miyapur Cheddi Gang Robbery
Srilakshmi C
|

Updated on: Mar 18, 2024 | 11:43 AM

Share

మియాపూర్‌, మార్చి 18: హైదరాబాద్‌ నగరంలోని మియాపూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో చెడ్డీ గ్యాంగ్‌ శనివారం (మార్చి 16) రాత్రి చోరీకి పాల్పడిన సంగతి తెలిసిందే. బ్లాక్‌ చెడ్డీలు ధరించి మారణాయుధాలతో స్కూల్‌లో ప్రవేశించిన అగంతకులు పాఠశాల కార్యాలయంలోని కౌంటర్‌లో ఉన్న రూ.7.85 లక్షల నగదును దోచుకెళ్లారు. చోరికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మియపూర్ సీఐ దుర్గ రామ లింగ ప్రసాద్ మీడియా సమావేశంలో చెడ్డి గ్యాంగ్ అప్డేట్‌కు సంబంధించి కీలక సూచనలు చేశారు. సీఐ దుర్గ రామ లింగ ప్రసాద్ మాట్లాడుతూ.. ఈ నెల 16న ఓ స్కూల్‌లో అర్ధరాత్రి చోరీ జరిగిందని ఫిర్యాదు వచ్చింది. వారి వేషధారణ అంతా చెడ్డి గ్యాంగ్‌లా ఉన్నారు. స్కూల్ లోని కౌంటర్‌లోకి చొరబడి రూ.7 లక్షల 85 వేల నగదును దోచుకెళ్లారు.

దొంగతనం దృశ్యాలు స్కూల్‌లో ఉన్న సీసీ కెమెరా లో రికార్డ్ అయ్యాయి. ఒంటిమీద బట్టలు లేకుండా చెడ్డీలతో దొంగలు వచ్చారు. మొత్తం ముగ్గురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాం. స్కూలు యాజమాన్యం లో పనిచేసే వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉందా? అని కోణంలో కూడా విచారణ చేస్తున్నాం. నిందితుల కోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నాం. గతంలో కూడా చెడ్డీ గ్యాంగ్ ఈ ప్రాంతంలో చోరీలకు పాల్పడ్డారు. రానున్న రోజుల్లో సెలవులు కూడా ఉండడంతో మియాపూర్ ప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ’ సీఐ పేర్కొన్నారు. తమ పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలన ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

కాగా హఫీజ్‌పేట్‌లోని వరల్డ్ వన్ ప్రైవేటు స్కూల్‌లో మార్చి 17 అర్ధరాత్రి దాటిన తర్వాత కొందరు దుండగులు చోరీకి యత్నించారు. చెడ్డీలు ధరించి, ముఖాలకు ముసుగు ధరించి మారణాయుధాలతో వచ్చారు. అనంతరం స్కూల్ కార్యాలయంలో ప్రవేశించి కౌంటర్‌లో ఉన్న రూ.7.85 లక్షల నగదును దోచుకెళ్లారు. ఇందుకు సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎప్పుడో వదిలి వెళ్లిపోయారనుకున్న చెడ్డీ గ్యాంగ్ నగరంలో మళ్లీ ప్రత్యక్ష్యం కవాడంతో నగర వాసులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
తెలంగాణ పోలీసులపై మహారాష్ట్రలో దాడి.. బేడీలతోనే దొంగ పరార్..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగుల థ్రిల్లర్ మూవీ..
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
వన్డే వరల్డ్ కప్ నుంచి స్టార్ ప్లేయర్ ఔట్.. ఆసీస్ సంచలన నిర్ణయం
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
యూఎస్ మెరైన్ క్యాంప్‌పై ఇరాన్ క్షిపణి దాడి?
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఈ ఆకు సర్వరోగ నివారిణి.. ఉదయాన్నే ఇలా తిన్నారంటే.. బ్లడ్ షుగర్‌
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఏఐ ప్లస్ నోవా 2 పవర్ 5జీలో స్పెషల్ ఫీచర్లు ఇవే
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో ఉన్న 8 మందిని, ఓ పిల్లిని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా
OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా