Hyderabad: త్వరలో ప్రారంభం కానున్న ఓఆర్‌ఆర్ సైకిల్ ట్రాక్..
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణహితంగా ఓఆర్‌ఆర్ వెంట సోలార్ రూప్ టాక్ సైకిల్ ట్రాక్ నిర్మాణం పూర్తికావచ్చందని.. హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం రోజున ఐటీ కారిడర్‌లోని నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు నిర్మించినటువంటి సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణం విశిష్టతకు సంబంధించిన విషయాన్ని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సీజీఎం రవీందర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్ న్యూస్, సెప్డెంబర్ 3: ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణహితంగా ఓఆర్‌ఆర్ వెంట సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణం పూర్తికావచ్చందని.. హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం రోజున ఐటీ కారిడర్‌లోని నానక్‌రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు నిర్మించినటువంటి సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణం విశిష్టతకు సంబంధించిన విషయాన్ని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ సీజీఎం రవీందర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశంలో మొదటిసారిగా ఒకేసారి 23 కిలోమీటర్ల పొడవుతో గ్రీన్‌ఫిల్డ్ సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పేర్కొన్నారు. అయితే సోలార్ సైకిల్ ట్రాక్ నిర్మాణంలో కొన్ని చెట్లను తొలగించినట్లుగా వస్తున్నటువంటి వార్తలను ఆయన కొట్టిపారేశారు.
సైకిల్ ట్రాక్ నిర్మాణంలో తాము నిర్దేశిత ప్రమాణాలను పాటించినట్లు పేర్కొన్నారు.. అలాగే సోలార్ లైటింగ్ అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఏర్పాటులో భాగంగానే కొన్ని మొక్కలను తాత్కాలకి ప్రాతిపదికన తీశామని చెప్పారు. అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం పనులు పూర్తైపోయిన తర్వాత మళ్లీ ఆ మొక్కలను అదే చోట నాటినట్లు పేర్కొన్నారు. అవసరమైన చోట.. ట్రీ ప్రొటెక్షన్ కమిటీ అనుమతులకు లోబడి హెచ్‌ఎండీఏ బాధ్యతాయుతంగా పనులు నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే కొన్ని ఎన్జీఓ సంస్థలు ఉద్దేశపూర్వకంగా హెచ్‌ఎండీఏ చేస్తున్నటువంటి అనేక పనులను ప్రజలను తప్పుదారి పట్టించేలా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నాయని తెలిపారు. ఇకనుంచి ఇలాంటి వాటిపై హెచ్‌ఎండీఏ సీరియస్‌గా తీసుకుంటుందని హెచ్చరికలు చేశారు.
ఇదిలా ఉండగా నగరానికి పడమర దిక్కున ఉన్నటువంటి ఐటీ కారిడర్ గత 9 సంవత్సరాల్లో వేగంగా అభివృద్ధి చెందింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ఓఆర్‌ఆర్‌పై.. సర్వీసు రోడ్ల మీదుగా ట్రాఫిక్ రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సర్వీసు రోడ్ల విస్తరణ పనులు.. అలాగే కొత్తగా ఇంటర్ చేంజ్‌ల నిర్మాణాలను చేపట్టినట్లు సీజీఎం రవీందర్ పేర్కొన్నారు. ఔటర్ రింగు రోడ్డు వెంట ఉన్న సర్వీసు రోడ్డు రెండు వరసలతో ఉండగా.. దాన్ని 4 వరసలతో విస్తరించామని చెప్పారు. ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు రోడ్లు నిర్మించామని.. వీటితో పాటే సైకిల్ ట్రాక్‌ను సైతం 4.5 మీటర్ల వెడల్పుతో.. 23 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్నామని చెప్పారు. ఇక సర్వీసు రోడ్ల విస్తరించిన సమయంలో దాదాపు 5 వేల 823 మొక్కలు తొలగించాలని నిర్ణయించగా.. వాటి నిబంధనలకు అనుగుణంగా అటవీ శాఖ అధికారుల నుంచి కూడా అనుమతి తీసుకున్నట్లు చెప్పారు. ఆ చెట్లను తొలగించిన తర్వాత వాటిని వేరే చోట నాటామని చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




