Pawan Kalyan: పవన్ పర్యటనలో అపశ్రుతి.. ఒక అభిమాని మృతి.. ముగ్గురికి గాయాలు

పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. పవన్ కాన్వాయ్ ను ఫాలో అవుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఓ అభిమాని మృత్యువాత పడ్డాడు.

Pawan Kalyan: పవన్ పర్యటనలో అపశ్రుతి.. ఒక అభిమాని మృతి.. ముగ్గురికి గాయాలు
Janasena
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 24, 2023 | 10:32 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించారు. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి ఈ రోజు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఈ వాహనం రోడ్డు ఎక్కింది. . ఉదయం సమయంలో ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం జనసేన ఎన్నిక ప్రచార రథం వారాహి పైకి ఎక్కి ప్రసంగించారు. అయితే పవన్ ను చూసేందుకు చాలా మంది అభిమానులు వచ్చారు. కాగా పవన్ వారాహి వెంట బైక్ లతో అభిమానులంతా ర్యాలీగా వెళ్లారు.

కాగా ఈ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. పవన్ కాన్వాయ్ ను ఫాలో అవుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ఓ అభిమాని మృత్యువాత పడ్డాడు. కిషన్ రావు పేట దగ్గర పవన్ కాన్వాయ్ లోని కారును అభిమాని బైక్ ఢీ కొట్టాడు.

ఈ ప్రమాదంలో ఒక అభిమాని మృతి చెందగా ముగ్గురికి గాయాలు అయ్యాయి. పవన్ కాన్వాయ్ ను వెంబడించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని జగిత్యాలలోని హాస్పటల్ కు తరలించారు.