Telangana: యూత్‌లో ఓటుపై పెరుగుతోన్న అవగాహన.. గతేడాది కొత్తగా ఏకంగా..
ఈ నేపథ్యంలో గురువారం (జనవరి 25వ తేదీ) జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి, అధికార మార్పిడి కూడా జరిగింది. ఇక ప్రస్తుతం లోక్ సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అధికారులు ఇప్పటి నుంచే ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. ఓటర్లలో ఓటు హక్కు వినియోగంపై చైతన్యాన్ని నింపింది. మరీ ముఖ్యంగా యువతను ఓటు వినియోగించుకునే దిశగా ప్రచారాలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో గురువారం (జనవరి 25వ తేదీ) జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళసై ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన గవర్నర్.. యువతకు ఓటు ప్రాధాన్యత ను తెలిపారు. అనంతరం కొత్తగా ఓటు నమోదు చేసుకున్న విద్యార్థులకు ఓటర్ ఐడిని అందజేశారు. అలాగే గవర్నర్ మాట్లాడుతూ.. పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కని చెప్పారు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కోసం లైన్‌లో ఉంటారు. అలాగే ఓటు కోసం కూడా లైన్‌లో ఉండాలని సూచించారు.
14వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జేఎన్టీయూలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగ్గా పనిచేసి విధులు నిర్వహించిన ఎన్నికల సిబ్బందికి అవార్డులు అందజేసింది ఎన్నికల కమిషన్. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ మాట్లాడుతూ 2023 సంవత్సరం మొత్తంలో కేవలం యంగ్ ఓటర్స్ దాదాపు పది లక్షల వరకు కొత్తగా అప్లై చేసుకున్నారని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత అని గుర్తు చేశారు ఎన్నికల అధికారి. గడిచిన తెలంగాణ ఎన్నికలని ప్రశాంతంగా నిర్వహించామని రాబోయే లోక్సభ ఎన్నికలకు కోసం సిద్ధమవుతున్నామని తెలిపారు. ఫిబ్రవరి 8వ తేదీన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ ఫైనల్ లిస్టును ప్రకటిస్తామని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
