Telangana Governor Tamilisai : కరోనా టీకాపై అనుమానం అక్కర్లేదు. ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలి…
కరోనా వ్యాక్సిన్‌పై అనుమానం అక్కర్లేదని, చాలా సురక్షితమని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. అపోహలు నమ్మకుండా ప్రతిఒక్కరూ

Governor's Tamilisai letter
కరోనా వ్యాక్సిన్‌పై అనుమానం అక్కర్లేదని, చాలా సురక్షితమని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. అపోహలు నమ్మకుండా ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని ఆమె సూచించారు. ‘చాలామంది మీరు టీకా తీసుకున్నారా.? అని అడుగుతున్నారు. నేను సాధారణ పౌరురాలినే. సాధారణ పౌరులకు అందుబాటులోకి వచ్చాక టీకా తీసుకుంటా’ అని గవర్నర్ అన్నారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ దవాఖానలో కరోనా వ్యాక్సిన్ పంపిణీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. దేశం కరోనా టీకాను తయారు చేసి స్వయం సమృద్ధి సాధించిందని అన్నారు. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వారియర్స్ టీకా తీసుకునేందుకు భయపడొద్దని సూచించారు.



