NIA Searche: తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ లింకులు.. రంగంలోకి దిగిన 23 ఎన్‌ఐఏ టీమ్‌లు..

నిజామాబాద్‌, కర్నూలు, గుంటూరు, ఆదిలాబాద్‌, నెల్లూరులో ఎన్ఐఏ (NIA) తనిఖీలు నిర్వహిస్తోంది. భైంసా అల్లర్లతో సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది..

NIA Searche: తెలుగు రాష్ట్రాల్లో టెర్రర్ లింకులు.. రంగంలోకి దిగిన 23 ఎన్‌ఐఏ టీమ్‌లు..
Nia
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 18, 2022 | 10:55 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఐదు జిల్లాల్లో NIA సోదాలు చేపట్టింది. ఉగ్రవాద కార్యకలాపాలపై ఆరా తీస్తున్నాయి. నిజామాబాద్‌, కర్నూలు, గుంటూరు, ఆదిలాబాద్‌, నెల్లూరులో ఎన్ఐఏ (NIA) తనిఖీలు నిర్వహిస్తోంది. భైంసా అల్లర్లతో సంబంధాలపై ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో 23 ఎన్‌ఐఏ బృందాలు సోదాలు చేపట్టాయి. కర్నూలుతో పాటు గుంటూరులో మరో 23 టీమ్‌లు తనిఖీలు నిర్వహిస్తున్నాయి. భైంసా అల్లర్లతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే పీఎఫ్‌ఏ(PFI) నిజామాబాద్ జిల్లా కన్వీనర్ షాదుల్లా.. మహమ్మద్‌ ఇమ్రాన్‌, అబ్దుల్ మోబిన్‌ అరెస్ట్ చేశారు. దేశద్రోహం కేసులు నమోదు చేశారు.

నంద్యాలలో పీఎఫ్‌ఏ కార్యకర్త యూనస్ అహ్మద్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. గుంటూరులో రెండు బృందాలు విస్తృతంగా గాలిస్తున్నాయి. కరాటే, లీగల్‌ అవేర్నెస్‌ ముసుగులో పీఎఫ్‌ఏ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మతకలహాలు సృష్టించేందుకు ట్రైనింగ్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది.

ఎన్ఐఏ అధికారుల దాడులతో జగిత్యాల జిల్లా ఉలిక్కిపడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి జగిత్యాల జిల్లాలో పాపులర్ ఫ్రంట్ నాయకుల ఇండ్లపై దాడులు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ లో కేంద్రంగా వీరి దాడులు కొనసాగాయి. ఈ కాలనీలో ఉంటున్న ఒకరితోపాటు జగిత్యాల పట్టణంలో ముగ్గురి నివాసలతో పాటు ఒక మెడికల్ షాప్‌లో కూడా దాడులు నిర్వహించారు. ఎన్ఐఏ అధికారుల దాడుల్లో కొందరి నుంచి వారికి సంబంధించిన డైరీతోపాటు కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ దాడుల్లో ఒకరి నివాసంలో డైరీతో పాటు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!