ఆ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిపై కలెక్టర్ స్పెషల్ ఫోకస్.. వైద్యుల నిరసన..
నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో జిల్లా అధికారుల పరిశీలన.. జిల్లా కలెక్టర్ వర్సెస్ వైద్యుల వార్‌గా మారుతోంది. జిజిహెచ్‌లో మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేకాధికారుల పరిశీలనకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కార్యాచరణ రూపొందించారు. జిజిహెచ్‌లో జిల్లా స్థాయి అధికారుల పెత్తనమెంటని ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు ఇతర సిబ్బంది ఆందోళన చేశారు.
నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో జిల్లా అధికారుల పరిశీలన.. జిల్లా కలెక్టర్ వర్సెస్ వైద్యుల వార్‌గా మారుతోంది. జిజిహెచ్‌లో మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేకాధికారుల పరిశీలనకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కార్యాచరణ రూపొందించారు. జి జిహెచ్లో జిల్లా స్థాయి అధికారుల పెత్తనమెంటి అంటూ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్యులు, ఇతర సిబ్బంది ఆందోళన చేశారు. నూతనంగా జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన నారాయణ రెడ్డి కొద్దిరోజుల క్రితం జీజీహెచ్‌ను సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలు, హెచ్ వోడీల పనితీరుపై సమీక్షించారు. వైద్యాధికారులు, సిబ్బంది పని తీరు మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. జీజీహెచ్ మెరుగైన సేవలు, జవాబుదారీతనం కోసం నిత్యం అధికార యంత్రాంగంలోని ఏదో ఒక శాఖ జిల్లా అధికారి ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
రోగుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారనే ఫిర్యాదుతో ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు నలుగురు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. కలెక్టర్ ఆదేశాలతో జడ్పీ సీఈవో ప్రేమ కరణ్ రెడ్డి జిజిహెచ్‌కు రావడాన్ని నిరసిస్తూ వైద్యులు, సిబ్బంది ఆందోళన చేపట్టారు. దీంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. కలెక్టరు, అదనపు కలెక్టరు మినహా ఇతర జిల్లా అధికారులు హాస్పిటల్ పరిశీలనకు ఎలా వస్తారని, తమపై వారి పెత్తనం ఏంటని వైద్యులు ప్రశ్నిస్తున్నారు. జిజిహెచ్‌లో వైద్యుల సమయపాలన, పారిశుద్ధ్యం, తాగునీరు, రోగులకు అందుతున్న సేవలపైనే పరిశీలనకు ప్రత్యేకాధికారుల నియామకం జరిగిందని అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర సర్ది చెప్పినా వైద్యులు వినలేదు. వైద్యుల రోజువారీ పనిలో వారు జోక్యం చేసుకోవడం లేదని, వైద్య సేవల మెరుగు కోసమే రోజువారి జిల్లా అధికారుల పరిశీలన అని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..