AP Irrigation Officials: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న నీటి పంచాయితీ.. ఏపీ అధికారులను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు

తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ప్రాజెక్ట్‌ల దగ్గర హైటెన్షన్‌ను క్రియేట్‌ చేస్తోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు ప్రాజెక్ట్‌ల దగ్గర బందోబస్తును పెంచడం ఉద్రిక్తతకు దారితీస్తోంది.

AP Irrigation Officials: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న నీటి పంచాయితీ.. ఏపీ అధికారులను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు
Police Stopped Ap Irrigation Officials
Follow us

|

Updated on: Jul 01, 2021 | 3:11 PM

Police Stopped AP Irrigation Officials: తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం ప్రాజెక్ట్‌ల దగ్గర హైటెన్షన్‌ను క్రియేట్‌ చేస్తోంది. తెలంగాణ, ఏపీ పోలీసులు ప్రాజెక్ట్‌ల దగ్గర బందోబస్తును పెంచడం ఉద్రిక్తతకు దారితీస్తోంది. సాగర్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేయాలంటూ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఏపీ అధికారులను తెలంగాణ సరిహద్దు దగ్గరే ఆపేశారు పోలీసులు. ఏపీ అధికారుల వినతి పత్రాన్ని తీసుకునేందుకు నిరాకరించారు తెలంగాణ జెన్‌కో అధికారులు. ప్రస్తుతం సాగర్‌ దగ్గర పరిస్థితి ప్రశాంతంగా ఉందని, అందరూ సంయమనం పాటించాలని కోరారు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని.

మరోవైపు పులిచింతల దగ్గర మాత్రం తెలంగాణ అధికారులకు లేఖ అందించారు ఏపీ అధికారులు. పులిచింతల ప్రాజెక్ట్ దగ్గర ఇరు రాష్ట్రాల SEలు సమావేశం అయ్యారు. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేయడం సరికాదంటూ తెలంగాణ జెన్‌కో SE దేశ్యా నాయక్‌కు లేఖ ఇచ్చారు ఏపీ వైపు ప్రాజెక్ట్ SE రమేష్‌బాబు. ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర స్టోరేజ్‌కి అవకాశం లేకపోయినా విద్యుత్‌ను వాడటం సరికాదన్నారు. అసలు పులిచింతల ప్రాజెక్ట్‌ జల విద్యుత్‌ ప్రాజెక్టే కాదన్నారు ప్రాజెక్ట్‌ ఎస్ఈ రమేష్‌బాబు. ప్రొటోకాల్‌ పాటించకుండా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేయడం సరికాదన్నారు.

పులిచింతల దగ్గర తెలంగాణ వైపు భద్రతను పర్యవేక్షించారు సూర్యాపేట ఎస్పీ. ఏపీ వైపు నుంచి సత్తెనపల్లి డీఎస్పీ కూడా ప్రాజెక్ట్‌ దగ్గరకు వచ్చారు. అటు, ఇటు పోలీసుల మోహరింపుతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల దగ్గర హైటెన్షన్‌ నెలకొంది. ఈ మూడు ప్రాజెక్ట్‌ల పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. విద్యుత్‌ ఉత్పత్తిని ఆపాలంటూ ఏపీ వైపు నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ వైపు భద్రతను పెంచారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తెలంగాణ పోలీసులు బందోబస్తును పెట్టారు. కృష్ణాలో ప్రవాహాలు రాకపోయినా, కనీసం నీటి మట్టాలు లేకపోయినా తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తిని చేస్తోందని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు ఫిర్యాదు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

Read Also…  Red Sandal: లాక్‌డౌన్ ముగియడంతోనే ఎంట్రీ ఇచ్చిన స్మగ్లర్లు.. శేషాచలం అడవుల్లో దొరికిన రెడ్‌ శాండల్‌ డంప్‌