Darbhanga blast: ముమ్మాటికి ఉగ్ర కుట్రే..! ఇది ట్రయల్ బ్లాస్ట్..! నెక్ట్స్ మల్లెపల్లిలోనే..! బయటపడుతున్న నిజాలు..!

Darbhanga blast: ముమ్మాటికి ఉగ్ర కుట్రే..! ఇది ట్రయల్ బ్లాస్ట్..! నెక్ట్స్ మల్లెపల్లిలోనే..! బయటపడుతున్న నిజాలు..!
Isi Big Blast

Dharbanga Blast: ముమ్మాటికి ఉగ్ర కుట్రే. కానీ ఇప్పుడు ఉగ్రోన్మాదం రూట్ మార్చింది. రద్దీ ప్రాంతాల్లో బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించడం కాదు.. ఉవ్వెత్తున ఎగసిపడే మంటలతో మారణ హోమం సృష్టించడం.. అమాయక జనాన్ని నిలువునా కాల్చేసే కుట్రలకు తెరతీసింది.

Sanjay Kasula

|

Jul 02, 2021 | 10:24 AM

ముమ్మాటికి ఉగ్ర కుట్రే. కానీ ఇప్పుడు ఉగ్రోన్మాదం రూట్ మార్చింది. రద్దీ ప్రాంతాల్లో బాంబులు అమర్చి విధ్వంసం సృష్టించడం కాదు.. ఉవ్వెత్తున ఎగసిపడే మంటలతో మారణ హోమం సృష్టించడం.. అమాయక జనాన్ని నిలువునా కాల్చేసే కుట్రలకు తెరతీసింది. దర్భంగలో ఉగ్రమూక ఇదే ఫార్మూలాను ఫాలో అయింది. కాకపోతే టైమింగ్‌లో తేడాతో పెనుముప్పు తప్పింది. అక్కడ సక్సెస్ అయితే హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న మల్లెపల్లిలోనూ మంటలు భగ్గుమనేవే. వందలమంది సజీవంగా దహనమయ్యే వారే. కానీ NIA అప్రమత్తత.. ఉగ్ర కుట్రను బెడిసికొట్టేలా చేసింది.

హైదరాబాద్‌కు చెందిన మాలిక్ బ్రదర్స్‌.. మల్లేపల్లి కేంద్రంగా మంటల పథక రచన చేశారు. లోకల్‌గా దొరికే పదార్థాలతోనే ఫైర్ బర్న్ చేయాలన్నది వాళ్ల ప్లాన్. ఇదే విషయాన్ని ఎన్‌ఐఏ అధికారులు కూడా నిర్ధారించారు. కొంత సల్ఫ్యూరిక్.. ఇంకాస్త నైట్రిక్ యాసిడ్స్‌.. మరికొంచెం షుగర్‌.. ఈ మూడు వస్తువులతోనే మంటలు క్రియేట్ చేసే ఆలోచన చేశారు. ఇందుకు సంబంధించి పాకిస్తాన్‌ నుంచి ఇక్బాల్‌ ఖాన్‌ సెండ్ చేసిన యూట్యూబ్‌ లింక్స్‌.. మరికొన్ని ఫైర్‌ యాక్సిడెంట్స్‌కి సంబంధించిన వీడియోలు మాలిక్ బ్రదర్స్‌ స్టడీ చేశారు.

పక్క రాష్ట్రాల నుంచి ఎక్స్‌ప్లోజివ్స్‌ తీసుకొస్తే పోలీసుల కంట పడే ప్రమాదం ఉందని గ్రహించిన మాలిక్ బ్రదర్స్‌.. లోకల్‌గా దొరికే ముడి సరుకుతోనే మారణహోమం సృష్టించాలనుకున్నారు. అగ్ని ప్రమాదాలు సృష్టించడం ఎలా అనే అంశాలపై ఆన్‌లైన్‌లో ట్రైనింగ్‌ కూడా తీసుకున్నారు. షేర్ చేసిన లింక్‌ల నుంచి చాలా సమాచారం సేకరించారు. రెండు వారాల కిందట దర్బంగ ఎక్స్‌ప్రెస్‌ రన్నింగ్‌లో ఉండగా మంటలు లేచేలా స్పాట్‌ పెట్టారు.

మంటల మ్యాటర్‌పై పాకిస్తాన్‌ నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు వచ్చేవి. బాంబ్ బ్లాస్టింగ్‌ ఎక్స్‌పర్ట్స్‌తో ఆన్‌లైన్‌లో మాట్లాడించేవాళ్లు ఉగ్రవాదులు. ఇంటర్నెట్, ఇన్‌స్టా గ్రామ్‌లను ఉపయోగించారు. స్పాట్‌లో భాగంగా రెండు వారాల కిందట ఇమ్రాన్ తన సోదరుడు నాసిర్ దగ్గర ఆశ్రయం తీసుకున్నాడు. చిక్కడపల్లి, హబీబ్‌నగర్‌లో వేర్వేరు దుకాణాల నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్‌, నైట్రిక్ యాసిడ్, షుగర్‌ కలిపి మంటలు సృష్టించే బాంబుల్ని తయారు చేశారు. దాన్ని మల్లేపల్లిలోని తాము ఉండే నివాసంలోనే ప్రయోగించారు. ఇంట్లో సక్సెస్ కావడంతో బయట ప్రయోగించాలని డిసైడ్ అయ్యారు.

ఓ టానిక్ సీసాలో సల్ఫ్యూరిక్‌, నైట్రిక్ యాసిడ్‌, షుగర్‌లు పోశారు. వాటి మధ్యలో సిల్వర్‌ కవర్‌లు పెట్టారు. కెమికల్స్‌కి కవర్‌లు ఎప్పుడు కరిగిపోతాయో అప్పుడు మంటలు లెస్తాయన్నమాట. మూడు పదార్థాలు కలిస్తే దాని విస్పోటనం భారీ స్థాయిలో ఉంటుంది. దర్బంగ ట్రైన్‌లో ఇలాగే జరగాలని ప్లాన్ చేసారు. రన్నింగ్‌ ట్రైన్‌లో మంటలు లేస్తే భోగిలో ఉండేవాళ్లంతా అగ్నికి ఆహుతి కావాలన్నది వాళ్ల ప్లాన్. కానీ అది స్టేషన్‌లోనే మండింది. పార్సిల్‌ ప్యాకేజీ మార్గమధ్యలోనే కిందపడడంతో మాలిక్ బ్రదర్స్‌ ప్లాన్ బెడిసికొట్టింది.

కెమికల్‌తో కూడిన బాక్స్‌ను సికింద్రాబాద్‌ నుంచి పార్సిల్ చేశారు. నిజానికి బీహార్‌లోని దర్బంగాలో 16 గంటల తర్వాత మంటలు లేవాలి. కానీ వాళ్ల లెక్క తప్పింది. పోలీసులకు చిక్కేలా చేసింది. గతంలో చాలా ట్రైన్లలో ఫైర్ అక్సిడెంట్లు జరిగాయి. కానీ ఫైర్‌ వెనుక అసలు రీజన్‌ ఏంటన్నది పక్కాగా తేలలేదు. దీన్నే ఉగ్రవాదులు క్యాష్ చేసుకున్నట్టుగా స్పష్టమవుతోంది. బాంబ్ బ్లాస్టింగ్ కంటే జనాన్ని కాల్చి చంపితేనే తమపై అనుమానం రాదని భావించారు. పైగా తమపై నిఘా కూడా ఉండదని లెక్కలేసుకున్నారు. అందుకే ఉగ్రమూక రూట్‌ మార్చినట్టు భావిస్తోంది ఎన్‌ఐఏ.

అసలు మాలిక్ బ్రదర్స్‌ మల్లెపల్లిలో ఎప్పటి నుంచి అడ్డా వేశారు..?

పక్కవాళ్లకు అనుమానం రాకుండా ఏం చేశారు..?

నిజానికి హైదరాబాద్ మహానగరం. పైగా మల్లేపల్లి లాంటి ప్రాంతాల్లో ఇళ్లు ఇరుకు ఇరుకుగా ఉంటాయి. భౌగోళికంగా ఇలాంటి ప్రాంతాలపై నిఘా పెట్టలేని పరిస్థితి. ఇక పాక్‌తో స్థానికంగా ఉండేవాళ్ల బంధుత్వాలు, రాకపోకలు ఎక్కువ. దీన్నే ఉగ్రవాదులు క్యాష్ చేసుకుంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

బాంబు తయారీలో వినియోగించే పదార్థాలు ఒకప్పుడు బిహార్ నుంచి దిగుమతి అయ్యేవి. కానీ ఇప్పుడు లోకల్ గానే దొరుకుతున్నాయి. ముడిసరుకు ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడం అంత ఈజీ కాదంటున్నారు మాజీ పోలీస్ ఉన్నతాధికారులు.

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డన భారీ విధ్వంసం.. ఉవ్వెత్తున ఎగసిపడే మంటలతో ఊహకందని మరణాలు.. ఇదీ టెర్రరిస్టుల మాస్టర్‌ ప్లాన్‌. నాంపల్లి రైల్వే స్టేషన్‌కి కూతవేటు దూరంలో ఈ కుట్రకు పథక రచన చేశారు. ప్రశాంతంగా ఉండే మల్లెపల్లిని అడ్డాగా చేసుకుని మారణ హోమం సృష్టించాలని ప్లాన్ చేశారు.

ఇవి కూడా చదవండి: Anti-Drone System: జమ్ముకశ్మీర్‌లో డ్రోన్‌ టెర్రర్‌‌కు చెక్.. ఎయిర్‌బేస్‌పై యాంటీ డ్రోన్‌ జామర్లు

Warangal Chai Wala: మహ్మద్‌ పాషాతో ఫోన్‌లో మాట్లాడనున్న ప్రధాని మోడీ.. ‘మన్ కీ బాత్’లో వరంగల్ చాయ్ వాలా

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu