Telangana: పొలంలో పాతిపెట్టిన ఆ యువకుడి సమాధి 2 ఏళ్ల తర్వాత తెరిచి ఉంది.. వెళ్లి చూడగా
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్ గ్రామంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. రెండేళ్ల క్రితం మృతి చెందిన యువకుడి సమాధిని గుర్తు తెలియని దుండగులు తవ్వి, మృతదేహానికి చెందిన తలను మాయం చేశారు. 2024 నవంబర్ 19న వ్యవసాయ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు...

రెండేళ్ల క్రితం చనిపోయిన ఓ యువకుడి సమాదిని తవ్వి ఆ అస్థిపంజరం తలను మాయం చేశారు గుర్తు తెలియని దుండగులు. మూడు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన లాండ్గె వెంకట్ (19) రెండేళ్ల క్రితం 2024 నవంబర్ 19న వ్యవసాయ పనులు చేస్తూ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని సొంత పొలంలోనే పాతిపెట్టి సంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు నిర్వహించారు. అయితే గత మూడు రోజుల క్రితం ఆ ప్రదేశంలో గుంత తవ్విన ఆనవాళ్లు కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. పాతిపెట్టిన మృతదేహానికి చెందిన తల మాయమైనట్టుగా గుర్తించారు కుటుంబ సభ్యులు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన ఇచ్చోడ సీఐ బండారి రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అస్థిపంజరం తల భాగాన్ని ఎవరు ఎత్తుకెళ్లినట్లు.. ఎందుకు ఎత్తుకెళ్లినట్టు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆకతాయిల పనా లేక క్షుద్ర పూజల కోసం తలను మాయం చేశారా అన్నది తేలాల్సి ఉంది. గత ఆదివారం పుష్య అమావాస్య కావడం.. అత్యంత ప్రమాదకర అమావాస్య అన్న ప్రచారం నేపథ్యంలో మాంత్రుకులే ఈ దారుణానికి పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
