AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode bypoll: ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. ఇప్పటి వరకు..

ఇవాళ కాంగ్రెస్‌ అభ్యర్తి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు చండూర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

Munugode bypoll: ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్న కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. ఇప్పటి వరకు..
Palvai Sravanti
Sanjay Kasula
|

Updated on: Oct 14, 2022 | 8:47 AM

Share

మునుగోడులో నామినేషన్ల పర్వం నేటితో ముగియనుంది. ఉప ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ దాఖలు చేయడానికి రేపే ఆఖరి రోజు. ఇప్పటికే బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ తరపున ఇవాళ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం చివరి రోజు కావడంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలకు దీటుగా నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఇవాళ కాంగ్రెస్‌ అభ్యర్తి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు చండూర్ లోని తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా బంగారుగడ్డ గ్రామం నుంచి చండూర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు ఆమె ప్రదర్శన నిర్వహించనున్నారు. పాల్వాయి స్రవంతి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.

ఇప్పటి వరకు 56 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్క రోజే 24 మంది అభ్యర్థుల నామినేషన్‌ వేశారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికల ఓటర్ల జాబితా పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఓటర్ల జాబితా నివేదికను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. నిన్న ఓటర్ల జాబితా పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని.. ఫార్మ్ 6 ప్రకారం కొత్తగా దాదాపు 25 వేల ఓట్లు నమోదు చేసుకున్నారని కోర్టుకు తెలిపారు.

మునుగోడు నియోజకవర్గంలోని వివిధ మండలాలలో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగిందన్నారు. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయ్యిందని.. నవంబర్ 3 న ఉప ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. ఉపఎన్నికల నేపథ్యంలో భారీగా ఓటర్ల నమోదు అక్రమంగా జరిగిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

మునుగోడు ఉప ఎన్నికకు ఇవాళ్టితో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా.. 15వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. లోపాలున్న నామినేషన్లను తిరస్కరించి సక్రమంగా ఉన్న నామినేషన్ల వివరాలను సాయంత్రం ప్రకటిస్తారు. దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి ఈనెల 17 వరకు ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది. వచ్చే నవంబర్ నెల 3వ తేదీన పోలింగ్ జరగనుండగా 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితం ప్రకటిస్తారు.

మరిన్ని మునుగోడు వార్తల కోసం